Home /News /technology /

FLYTRAP ANDROID MALWARE HIJACKS YOUR FACEBOOK ACCOUNT HOW ITS ATTACK SU

Flytrap malware: జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతులు.. ఈ మాల్‌వేర్‌తో ఫేస్‌బుక్ అకౌంట్లకు ముప్పు.. ఆ యాప్స్ జాబితా ఇదే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మాల్‌వేర్ అనేది మనకి తెలియకుండానే, మన అనుమతి లేకుండానే మన డివైజ్‌లోకి ప్రవేశించి.. మొత్తం డివైజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది ఒక రకమైన సాఫ్ట్‌వేర్ అయినప్పటికీ చెడు కోసం ఉపయోగపడుతుంది

    మాల్‌వేర్ అనేది మనకి తెలియకుండానే, మన అనుమతి లేకుండానే మన డివైజ్‌లోకి ప్రవేశించి.. మొత్తం డివైజ్‌ను ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది ఒక రకమైన సాఫ్ట్‌వేర్ అయినప్పటికీ చెడు కోసం ఉపయోగపడుతుంది. ఇలాంటి రకరకాల మాల్‌వేర్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌ అకౌంట్లను ఫ్లై ట్రాప్‌గా పిలవబడుతున్న ట్రోజన్ అండ్రాయిడ్ మాల్‌వేర్‌ టార్గెట్ చేస్తోంది. ఈ మాల్‌వేర్ ద్వారా ఇప్పటికే 140 దేశాలలోని వేలాది ఫేస్‌బుక్ అకౌంట్లు హైజాక్ అయినట్టుగా చెబుతున్నారు. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జింపెరియం ట్రోజన్‌ మాల్‌వేర్‌ను కనుగొన్నారు. ట్రోజన్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పలు యాప్‌ల ద్వారా, ఇతర థర్డ్‌పార్టీ యాప్స్‌ ద్వారా అండ్రాయిడ్ డివైజ్‌లలోకి హ్యాకర్లు ప్రవేశపెడుతున్నట్టుగా జింపెరియం పేర్కొంది. దీని ద్వారా ఈ ఏడాది మార్చి నుంచి ఇది అండ్రాయిడ్ యూజర్లపై దాడులు జరుగుతున్నాయని తెలిపింది.

    ఈ కొత్త అండ్రాయిడ్ మాల్‌వేర్.. యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్ కూపన్ కోడ్‌లు.. వంటివాటిని ఎరగా వేస్తోంది. వాటి ద్వారా యూప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేలా చేస్తోంది. ఆ తర్వాత యాప్స్‌లో వివిధ ప్రశ్నలు అడుగుతారు.. చివరకు ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే విధంగా నిమగ్నం చేస్తారు. అనంతరం లాగిన్ అయిన వెంటనే.. కూపన్ కోడ్స్, క్రెడిట్స్ సేకరించడానికి ఓటు వేయమని కోరతారు. చివరకు యూజర్లు ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్‌తో హానికరమైన యాప్‌ల్లోకి లాగిన్ అయ్యేలా చేస్తున్నారు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు సింపుల్ ట్రిక్స్‌ను ప్లే చేస్తున్నారు. లాగిన్ అయిన తర్వాత ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు అనుసంధానించబడిని డేటాను మొత్తం సేకరిస్తాయి.

    ఫ్లైట్రాప్ అండ్రాయిడ్ మాల్‌వేర్(FLytrap Android malware).. యూజర్ల ఫేస్‌బుక్ ఐడీ, లోకేషన్, ఈమెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను పొందడానికి జావా స్క్రిప్ట్ ఇంజెక్షన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక సమాచారాన్ని దొంగిలించిన వెంటనే.. ఆ మొత్తాన్ని మాల్‌వేర్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు చేరవేస్తోంది. మీ అండ్రాయిడ్ డివైజ్‌లోకి చేరే ట్రోజన్ ద్వారా ఫేస్‌బుక్ ఖాతాను హైజాక్ చేసి.. సామాజిక గుర్తింపుకు ముప్పు ఏర్పడుతుంది.

    ఫ్లైట్రాప్ అండ్రాయిడ్ మాల్‌వేర్ యాప్స్..
    -GG Voucher (com.luxcarad.cardid)
    - Vote European Football (com.gardenguides.plantingfree)
    - Chatfuel (com.ynsuper.chatfuel)
    - Net Coupon (com.free_coupon.net_coupon
    - Net Coupon (com.movie.net_coupon)
    - GG Coupon Ads (com.free_coupon.gg_free_coupon)
    - GG Voucher Ads (com.m_application.app_moi_6)
    - GG Voucher (com.free.voucher)
    - EURO 2021 Official (com.euro2021)
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Android, Cyber criminals, Facebook

    తదుపరి వార్తలు