• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FLYING TAXIS COMING SOON IN INDIA IIT MADRAS INCUBATED STARTUP INVOLVED IN THIS PROJECT GH SRD

Flying Taxis: త్వరలోనే మన దేశంలో గాలిలో ఎగిరే ట్యాక్సీలు..ఎప్పుడంటే..

Flying Taxis: త్వరలోనే మన దేశంలో గాలిలో ఎగిరే ట్యాక్సీలు..ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Flying Taxis: ఈ ఫ్లయింగ్​ టాక్సీలు ఒకేసారి ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లగలవు. లిథియం- అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ టాక్సీలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో 0.5 కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఒక్కసారి దీన్ని ఛార్జ్​ చేస్తే మొత్తం 200 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు.

  • Share this:
ప్రపంచం రోజురోజుకి అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తున్న తరుణంలో అనేకానేక కొత్త వాహన సర్వీసులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగిరే వాహనాలు కూడా తయారవుతున్నాయి. తాజాగా, ఐఐటీ మద్రాస్​, ఐఐటి-మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘ది ప్లేన్​ కంపెనీ’ సరికొత్త ఫ్లయింగ్​ టాక్సీలను రూపొందించింది. పట్టణ ప్రయాణీకులను తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానాలను చేర్చేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఈ ఫ్లయింగ్​ టాక్సీలు సాధారణ టాక్సీలతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలవు. అదే విధంగా, ఎటువంటి ట్రాఫిక్​ సమస్యలు లేకుండా వీటిలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. బ్యాటరీతో నడిచే ఈ ఫ్లయింగ్​ టాక్సీలకు 200 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉంటుంది. ఈ ఫ్లయింగ్​ టాక్సీలు ఒకేసారి ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లగలవు. లిథియం- అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ టాక్సీలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో 0.5 కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఒక్కసారి దీన్ని ఛార్జ్​ చేస్తే మొత్తం 200 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు. ఫుల్​ ఛార్జింగ్​తో దాదాపు 10 నుండి 20 ట్రిప్పులు చేయగలిగే సామర్థ్యం ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "దీనిలో ప్రయాణించేందుకు సాధారణ టాక్సీ కంటే 1.5 నుండి 2 రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, ఎటువంటి ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. మా టాక్సీతో కేవలం 10 నిమిషాల్లోనే 10 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని 10 రెట్లు తగ్గిస్తుంది.”అని అన్నారు.

కాగా, ఈ స్టార్టప్​ సంస్థను ఐఐటిఎం గ్రాడ్యుయేట్ ప్రంజల్ మెహతాతో కలిసి ప్రొఫెసర్ చక్రవర్తి ప్రారంభించారు. అయితే, ప్రారంభంలో దీని ప్రయాణానికి కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ.. టాక్సీల సంఖ్య పెరిగే కొద్ది ఖర్చు తగ్గించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో వీటి ప్రయాణ ఛార్జీలు ఇతర యాప్​ -ఆధారిత టాక్సీ సర్వీసులతో సమానంగా ఉంటాయని పేర్కొన్నారు.

10 రెట్లు వేగంగా ప్రయాణం..
ప్రస్తుతం ఉన్న విమానయాన చట్టాలు ఫ్లయింగ్ టాక్సీల అనుమతులను సులభతరం చేయనున్నాయని, దీంతో త్వరలోనే దేశీయ విపణిలో వీటి డిమాండ్​ పెరగనుందని ప్రొఫెసర్​ చక్రవర్తి అన్నారు. కాగా, ఈ ఫ్లయింగ్​ టాక్సీల వినియోగం కోసం ఇప్పటికే విమానయాన శాఖ క్లియరెన్స్​ కూడా ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైన ఫ్లయింగ్​ టాక్సీలు​.. త్వరలోనే మూడు లేదా నాలుగు సీట్ల సామర్థ్యంతో రూపొందనున్నాయి. అదే సమయంలో, వీటి ద్వారా కేవలం ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేయడమే కాకుండా కార్గో డెలివరీ సేవలను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పట్టణ లేదా ప్రాంతీయ కనెక్టివిటీ కోసం వేర్వేరు ఆకారాలు, పరిమాణాలలో కూడిన ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రయాణీకులను చేరవేయడానికే కాకుండా, ప్రోడక్ట్స్​ డెలివరీకీ సైతం ఉపయోగిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: