గాల్లో తేలుతూ వెంటవచ్చే గొడుగు... ఐడియా అదిరింది కదా...

Floating Umbrella : టెక్నాలజీ దుమ్మురేపుతోంది. మనకు ఎలా కావాలంటే అలా మారిపోతోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గొడుగు. దీని విశేషాల్ని అలా అలా తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: February 6, 2019, 6:34 AM IST
గాల్లో తేలుతూ వెంటవచ్చే గొడుగు... ఐడియా అదిరింది కదా...
డ్రోన్ అంబ్రెల్లా (Image : Twitter)
  • Share this:
వర్షం పడుతున్నప్పుడో, మంచు కురుస్తున్నప్పుడో... గొడుగు బయటకు తీస్తాం. బయట తిరిగినంతసేపూ... ఆ గొడుగును అలా పట్టుకోవాల్సిందే. పొరపాటున వదిలేశామా... అది గాలికి కొట్టుకుపోతుంది. ఏ బైకో నడుపుతూ గొడుగు పట్టుకోవాలంటే మన వల్ల కానిపని. ఇప్పుడా సమస్యలకు చెక్ పెడుతూ ఫ్లోటింగ్ అంబ్రెల్లా వచ్చేసింది. ఇది మామూలు గొడుగు కాదు. దీన్ని మనం పట్టుకోవాల్సిన పనే లేదు. గాల్లో తేలుతూ, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతోనే వస్తుంది. ఎప్పుడూ మన తలపైనే తేలుతూ... మనం ఏమాత్రం వర్షానికి, మంచుకీ తడిసిపోకుండా కాపాడుతుంది. ఫలితంగా దీన్ని మనం పట్టుకొని ఉండాల్సిన పనిలేదు. ఎంత గాలి వచ్చినా, ఏం జరిగినా ఇది మన తలపై నుంచీ పక్కకు వెళ్లనే వెళ్లదు. టెక్నాలజీ మహిమ అది.

 

దీన్ని డ్రోన్‌బ్రెల్లా అని పిలుస్తున్నారు. గొడుగుల్లో ఇది హైబ్రీడ్ గొడుగుగా చెబుతున్నారు. ఆగ్మెంటెడ్ మ్యాజిక్ షో ఆధారంగా దీన్ని తయారుచేశారు. ఓ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చెయ్యవచ్చు. ఈ కంట్రోల్స్‌లో మూడు రకాలున్నాయి. మాన్యువల్, ఫాలో మీ, స్టేషనరీ. మాన్యువల్‌లో గొడుగు ఎటువైపు ఎగురుతూ రావాలో మనమే డిసైడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఫాలో మీ ఆప్షన్‌తో మనం ఎటు వెళ్తే గొడుగు అటు వస్తుంది. అదే స్టేషనరీ ఆప్షన్ ఎంచుకుంటే... గొడుగు ఒకేచోట స్థిరంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ పద్ధతిగా జరగాలంటే... మన మొబైల్‌కి ఇంటర్నెట్ ఉండాలి. యాప్ పనిచేస్తూ ఉండాలి. మొబైల్ మన దగ్గరే ఉండాలి.
Loading...
ప్రస్తుతం దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. దాదాపు అవి విజయవంతం అవుతున్నాయి. అందువల్ల త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రస్తుతం దీని అంచనా ధర రూ.20,000 గా చెబుతున్నారు. ఐతే... ఎక్కువ మంది కొంటే... ఆటోమేటిగ్‌గా ధర దిగొచ్చే అవకాశం ఉంది.

Pics: నయనతార అరుదైన ఫోటోల కలెక్షన్
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...