Play store: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉంటే వెంటనే తీసేయండి.. లేకపోతే..

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఆండ్రాయిడ్ సర్వీస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చని ఆండ్రాయిడ్ యూజర్లను ఈ ఫేక్ యాప్ బ్యాచ్ బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్‌స్టాల్ చేసుకున్న వారి వాట్సాప్ డేటాను తస్కరిస్తున్నారు. అంతేకాదు.. వాట్సాప్ నోటిఫికేషన్లను మోనిటర్ చేస్తున్నారు. ఎవరైనా మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వారికి ఆటోమేటిక్‌గా ...

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఒకటేంటి వినోదమంతా ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. అంతటి వినోదాన్ని వీక్షించాలంటే మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే.. ఆ మెంబర్‌షిప్‌తో పనిలేకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ అని ప్రకటిస్తే ఇంకేమైనా ఉందా.. నెటిజన్లు అలాంటి అవకాశం కోసం ఎగబడరూ. కొందరు సైబర్ నేరగాళ్లకు ఆ బలహీనతే బలమవుతోంది. ఫేక్ యాప్స్‌ను నిరోధించేందుకు గూగుల్ ఎంత ప్రయత్నిస్తున్నా.. ఫేక్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌ను వేదికగా చేసుకుని నెటిజన్లను బురిడీ కొట్టించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా.. అలాంటి ఫేక్ యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్లు సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ గుర్తించారు. ఆండ్రాయిడ్ సర్వీస్ యాప్ ‘ఫ్లిక్స్‌ఆన్‌లైన్’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ ఫేక్ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లే లక్ష్యంగా జనాలను మాయబుచ్చుతున్నట్లు తేల్చారు. ఈ ‘ఫ్లిక్స్‌ఆన్‌లైన్’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చని ఆండ్రాయిడ్ యూజర్లను ఈ ఫేక్ యాప్ బ్యాచ్ బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్‌స్టాల్ చేసుకున్న వారి వాట్సాప్ డేటాను తస్కరిస్తున్నారు. అంతేకాదు.. వాట్సాప్ నోటిఫికేషన్లను మోనిటర్ చేస్తున్నారు. ఎవరైనా మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వారికి ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే రిప్లై ఇస్తున్నారు.

    అలా ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ద్వారా మాల్‌వేర్‌ను హ్యాకర్లు వాట్సాప్‌లోకి పంపుతున్నారని సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ తెలిపారు. అలా మాల్‌వేర్‌ను పంపి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వాట్సప్ అకౌంట్‌కు సంబంధించిన క్రెడెన్షియల్స్‌ను తస్కరించడం, యూజర్స్ డేటాను దొంగిలించడం చేస్తున్నారని తేల్చారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొరపాటున ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే.. మాల్‌వేర్ సర్వీస్ రిక్వెస్ట్‌లను పంపిస్తుందని, Overlay', 'Battery Optimization Ignore', and 'Notification’కు పర్మిషన్ అడుగుతుంది.

    తెలియక పర్మిషన్స్ అడుగుతుంది కదా అని యాక్సెస్ ఇచ్చారా.. మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది. మీకొచ్చే వాట్సాప్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లైలు వెళ్లిపోతాయి. మీ వాట్సప్ నెంబర్ నుంచి తప్పుడు సమాచారం గ్రూప్స్‌లో, వ్యక్తిగత నంబర్లకు వెళ్లే అవకాశముంది. అంతేకాదు, మీ వాట్సప్ సంభాషణలు, వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

    రీసెర్చర్స్ ఆ ఫేక్ యాప్ గూగుల్‌కు సమాచారమందించారు. దీంతో.. అప్రమత్తమైన గూగుల్.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌ను తొలగించింది. అయితే అప్పటికే.. రెండు నెలల వ్యవధిలో ‘ఫ్లిక్స్‌ఆన్‌లైన్’ అనే ఈ ఫేక్ ఆండ్రాయిడ్ సర్వీస్ యాప్‌ను 500 మంది డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. ఒకవేళ.. ఆ 500 మందిలో మీరూ ఉంటే వెంటనే ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
    Published by:Sambasiva Reddy
    First published: