Flipkart Sale: అర్థరాత్రి 12 గంటల నుంచి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే...

Flipkart Flipstart Days Sale | యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు.

news18-telugu
Updated: May 31, 2019, 3:16 PM IST
Flipkart Sale: అర్థరాత్రి 12 గంటల నుంచి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే...
Flipkart Sale: అర్థరాత్రి 12 గంటల నుంచి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే... (image: Flipkart)
  • Share this:
మరో భారీ సేల్‌కు రంగం సిద్ధం చేసింది ఫ్లిప్‌కార్ట్. శుక్రవారం అర్థరాత్రి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్' ప్రారంభించనుంది ఫ్లిప్‌కార్ట్. జూన్ 3 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మూడో సేల్ ఇది. మూడు రోజులపాటు జరిగే సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్‌తో పాటు అనేక వస్తువులపై ఆఫర్లున్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, పవర్ బ్యాంక్స్, మొబైల్ కేస్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జేబీఎల్, సోనీ లాంటి కంపెనీల హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. హెచ్‌పీ, ఏసర్ లాంటి కంపెనీల ల్యాప్‌టాప్స్ ప్రారంభ ధర రూ.12,990 మాత్రమే.

Read this: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'లో టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. 32 అంగుళాల వ్యూ స్మార్ట్ హెచ్‌డీ టీవీ రూ.12,499 ధరకే కొనొచ్చు. సమ్మర్ అప్లయెన్సెస్ అయిన ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంది. హోమ్ అండ్ ఫర్నీచర్ కేటగిరీలో 30 నుంచి 75 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఫ్యాషన్‌పై 40 నుంచి 80 శాతం, బ్యూటీ, బేబీకేర్, టాయ్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి మాత్రమే కాదు ఆన్‌లైన్‌లో గ్రాసరీస్ కొనేవారికి ఒక్క రూపాయికే కొన్ని వస్తువుల్ని అమ్మనుంది ఫ్లిప్‌‌కార్ట్. ఎంపిక చేసిన ఉత్పత్తులపై అదనంగా 15 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.1,499 బిల్లింగ్ చేసినవారికి 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది.

Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:
Loading...
ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే
First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...