ఫ్లిప్‌కార్ట్ కొత్తగా వారెంటీ అసిస్టెంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లకు రిపేర్ సర్వీస్‌ను అందిస్తోంది. వారెంటీలో ఉన్న స్మార్ట్‌ఫోన్ పాడైతే కస్టమర్లు సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వారెంటీ అసిస్టెంట్ సర్వీస్ కోసం రూ.99 చెల్లిస్తే ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటీవ్ ఇంటికి వచ్చి స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తారు. బ్రాండెడ్ సర్వీస్ సెంటర్లలో రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభకాలంలో ఇళ్లలోంచి బయటకు వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి కస్టమర్లకు సేవలు అందించేందుకు వారెంటీ అసిస్టెంట్ సర్వీస్‌ను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ అయిన జీవీస్ కన్స్యూమర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వారెంటీ అసిస్టెంట్ సేవల్ని అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. కేవలం వారెంటీ కవరేజీ ఉన్న ఉత్పత్తులకు మాత్రమే ఈ సర్వీస్ లభిస్తుంది.
మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే సమయంలోనే హోమ్ వారెంటీ సర్వీస్ యాడ్ ఆన్ ఉంటుంది. రూ.99 చెల్లించి ఈ యాడ్ ఆన్‌తో ఫోన్ కొనొచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటే ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే రిపేర్ చేయిస్తారు. రిపేర్ పూర్తైన తర్వాత ప్రొడక్ట్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా వీరిదే. అయితే మీకు వారెంటీలో కవర్ అయ్యే డ్యామేజ్‌లకు మాత్రమే ఈ రిపేర్ వర్తిస్తుంది. వారెంటీలో కవర్ కాని సమస్యలు ఉంటే మీరు వారెంటీ అసిస్టెంట్ సేవల్ని పొందలేరు.
ఇవి కూడా చదవండి:
Samsung Galaxy A21s: ఇండియాలో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్... ధర ఎంతంటే
రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా నుంచి రూ.251 ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Smartphone, Smartphones