హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ బుకింగ్ (Hotel Room Booking) సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. భారతదేశంతో పాటు ఇతరదేశాల్లో ఉన్న 3 లక్షలకు పైగా హోటళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేయొచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), డిజిటల్ కామర్స్ విభాగాల్లో సేవలను విస్తరిస్తోంది. పండుగ సీజన్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌ హోటల్‌ బుకింగ్స్ (Hotel Bookings) సేవల విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ‌ద్వారా హోటల్ రూమ్స్ బుక్‌ చేసుకొనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రంగంలోకి ప్రవేశించాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ క్లియర్‌ట్రిప్‌ను కంపెనీ గత ఏడాది కొనుగోలు చేసింది. తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించింది.

క్లియర్‌ట్రిప్ API సపోర్ట్‌, ట్రావెల్‌ సెక్టార్‌, కస్టమర్లపై క్లియర్‌ట్రిప్ లోతైన అవగాహన వంటివి ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌ సేవలకు ఉపయోగపడతాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ ఎలాంటి అవాంతరాలు లేని బుకింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని, ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా అప్‌టేడ్స్‌ అందిస్తుందని సంస్థ వెల్లడించింది.

Flipkart Big Billion Days: స్మార్ట్‌ఫోన్లపై బిగ్ బిలియన్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్‌ నెట్‌వర్క్‌లో 3 లక్షల హోటల్స్‌


కొత్త హోటల్-బుకింగ్ ఫీచర్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోటల్స్.. తన ప్లాట్‌ఫామ్‌లో 3 లక్షల నేషనల్‌, ఇంటర్నేషనల్‌ హోటళ్లలో గదులను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఫ్లెక్సిబుల్ ట్రావెల్, బుకింగ్ రిలేటెడ్ పాలసీలు, ప్రయాణాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు సులభమైన EMI ఆప్షన్లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌ వంటి యాడ్-ఆన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

కస్టమర్‌ కేర్‌ సెంటర్‌


ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో థర్డ్ పార్టీ ఆఫర్లను పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. హోటల్ బుకింగ్ సేవలపై అందించే ఫీడ్‌బ్యాక్‌, ఫిర్యాదుల ఆధారంగా సపోర్ట్‌ చేయడానికి కంపెనీ ప్రత్యేక కస్టమర్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Jio 6th Anniversary Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రూ.10 లక్షల వరకు రివార్డ్స్

హాస్పిటాలిటీ రంగానికి మంచి సమయం


2022 హాస్పిటాలిటీ రంగానికి గొప్ప సంవత్సరమని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. నేషనల్‌, ఇంటర్నేషనల్‌ అకామడేషన్‌ మార్కెట్‌కు డిమాండ్‌ పెరిగిందని, చాలా మంది కొత్త గమ్యస్థానాలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. వెకేషన్ రెంటల్స్ వంటి కొత్త ప్రయాణ పోకడలు వస్తున్నాయని, ఈ పరిణామాలు ట్రావెల్ పరిశ్రమకు ఊపునిస్తున్నాయని వివరించింది. గత రెండేళ్లలో 60 శాతం CAGRతో పోలిస్తే గత త్రైమాసికంలో 70 శాతం వృద్ధి కనిపించినట్లు చెప్పింది. రానున్న పండుగ సీజన్‌లో ట్రావెల్‌ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఫ్లిప్‌కార్ట్‌ అభిప్రాయపడింది.

త్వరలో స్పెషల్ సేల్


ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ కోసం సాధారణంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ద్రవ్యోల్బణం కారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పండుగ సీజన్ అమ్మకాలు ఈ సంవత్సరం తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు ఫ్లాట్‌గా ఉంటాయని, ఫ్యాషన్, సౌందర్య సాధనాలు, గృహాలంకరణ వస్తువుల కొనుగోళ్లు వృద్ధిని నమోదు చేయవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Hotels

ఉత్తమ కథలు