Flipkart: రూ.5,000 కోట్ల పెట్టుబడులు... 50,000 ఉద్యోగాలు... ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ ప్లాన్

Flipkart | ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో భూమిని గుర్తించింది ఫ్లిప్‌కార్ట్. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: April 24, 2019, 3:04 PM IST
Flipkart: రూ.5,000 కోట్ల పెట్టుబడులు... 50,000 ఉద్యోగాలు... ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ ప్లాన్
Flipkart: రూ.5,000 కోట్ల పెట్టుబడులు... 50,000 ఉద్యోగాలు... ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ ప్లాన్
news18-telugu
Updated: April 24, 2019, 3:04 PM IST
ఇ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న ఫ్లిప్‌కార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. లాజిస్టిక్స్ రంగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. భారీ పెట్టుబడుల ద్వారా ఏకంగా 50,000 ఉద్యోగాలు కల్పించొచ్చని ఓ అంచనా. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను నడిపిస్తున్న వాల్‌మార్ట్ గురుగ్రామ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లో లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భారతదేశంలో ప్రధాన పోటీదారైన అమెజాన్‌ను గట్టిగా ఢీకొట్టేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడ్తాయని వాల్‌మార్ట్ భావిస్తోంది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో భూమిని గుర్తించింది ఫ్లిప్‌కార్ట్. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం ప్రారంభం కానుంది.

Read this: SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

ఫ్లిప్‌కార్ట్ నిర్మించబోయే లాజిస్టిక్స్ పార్కులు సరుకు రవాణా, పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. సప్లై చెయిన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ లాజిస్టిక్ పార్క్స్ ఉపయోగపడ్తాయి. వేర్‌హౌజ్‌ను యంత్రాలతో నిర్మించడం ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫ్లిప్‌కార్ట్ చేపట్టిన 'నెక్స్ట్‌ 200 మిలియన్ కస్టమర్స్' ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరేందుకు ఈ కొత్త లాజిస్టిక్ పార్కులు దోహదం చేస్తాయని కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్‌లో డేటాబేస్ సెంటర్‌ను ప్రారంభించడం విశేషం. ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న డేటా బేస్ సెంటర్లలో ఇది రెండోది.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3



ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త
Loading...
SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

కొడుకును కాపాడబోయి కోమాలోకి... 27 ఏళ్ల తర్వాత స్పృహలోకి...
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...