ఫ్లిప్‌కార్ట్ సూపర్ సేల్‌లో ఆఫర్లు ఇవే!

ఆగస్ట్ 25న ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ సేల్ ప్రారంభం కాబోతోంది. మరి ఏమేం డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 24, 2018, 3:27 PM IST
ఫ్లిప్‌కార్ట్ సూపర్ సేల్‌లో ఆఫర్లు ఇవే!
ఆగస్ట్ 25న ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ సేల్ ప్రారంభం కాబోతోంది. మరి ఏమేం డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.
news18-telugu
Updated: August 24, 2018, 3:27 PM IST
బిగ్ ఫ్రీడమ్ సేల్‌లో కొన్న వస్తువులు ఇంకా పాతబడనే లేదు అప్పుడే మరో సేల్‌తో ముందుకు వచ్చేసింది ఫ్లిప్‌కార్ట్. ఆగస్ట్ 25న సూపర్ సేల్ పేరుతో డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఒకరోజు మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అదనపు లాభాలుంటాయి. అందరికీ ఆగస్ట్ 25న సూపర్ సేల్‌ ఆఫర్స్ లభిస్తే... ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు 24 రాత్రి 9 గంటల నుంచే ఆఫర్లు పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఆడియో ప్రొడక్ట్స్, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లున్నాయి. అర్థరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు 'రష్ హవర్' డీల్స్ ఉంటాయి. ఇక స్మార్ట్‌ఫోన్లపై సూపర్ డీల్స్‌ ఎనిమిది గంటలకోసారి రీఫ్రెష్ అవుతాయి. దాంతో పాటు 'ఎపిక్ 24' పేరుతో గంటగంటకో కొత్త డీల్ యాడ్ అవుతుంది.

రూ.17,900 ధర గల సాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్(64జీబీ) స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.10,990, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 32జీబీ ధర రూ.16,999, వివో వీ9 ధర రూ.20,990 ధరకే కొనుక్కోవచ్చు. ఆగస్ట్ 25 మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మీ 5 ఏ ఫ్లాష్ సేల్ మొదలవుతుంది. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 70 శాతం, ల్యాప్‌టాప్స్, ఆడియో డివైజెస్, కెమెరాలపై 80 శాతం, ఫర్నీచర్, ఫర్నీషింగ్, కుక్‌వేర్‌పై 40-80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.

First published: August 24, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...