• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FLIPKART SMARTPHONE CARNIVAL SALE TOP OFFERS ON IPHONE 11 MI 10T REALME POCO XIOMI AND OTHER SMART PHONES NS GH

Flipkart Smartphone Carnival sale: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. ఎల్లుండి వరకే ఛాన్స్..

Flipkart Smartphone Carnival sale: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. ఎల్లుండి వరకే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజం​ ఫ్లిప్‌కార్ట్ మరో సూపర్ సేల్​తో వినియోగదారుల ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్​​ ఏప్రిల్ 20తో ముగియనుంది. ఈ సేల్ లో వివిధ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లపై బంపర్​ ఆఫర్లు, డిస్కౌంట్లను అందించనుంది ఫ్లిప్ కార్ట్.

  • Share this:


ప్రముఖ ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​ ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్​తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఫ్లిప్​కార్ట్​ స్మార్ట్​ఫోన్​ కార్నివర్​ సేల్​ పేరుతో సరికొత్త సేల్​ను ప్రారంభించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్​​ ఏప్రిల్ 20తో ముగియనుంది. ఈ సందర్భంగా ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లపై బంపర్​ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. రియల్‌మీ సి 12, మోటో జి 10 పవర్, రియల్‌మీ నార్జో 30 ఎ, ఐఫోన్ ఎక్స్‌ఆర్ తో సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి ప్రముఖ ప్రైవేటు బ్యాంక్లకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై రూ. 750 వరకు తక్షిణ తగ్గింపును అందిస్తోంది. ఆయా బ్యాంకు కస్టమర్లు ఎంఐ 10 టి, ఐఫోన్ 12 ప్రో మాక్స్తో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై ఇన్​స్టన్ట్​ డిస్కౌంట్​ను పొందవచ్చు. కాగా, ఫ్లిప్​కార్ట్​ స్మార్ట్​ఫోన్​ కార్నివల్ సేల్​లో ఏ ఏ స్మార్ట్​ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయో తెలుసుకుందాం.

Moto G10 Power:

మోటో జి 10 పవర్ స్మార్ట్​ఫోన్​పై రూ.500 డిస్కౌంట్​ లభిస్తుంది. దీని అసలు ధర రూ .9,999 ఉండగా.. ఫ్లిప్​కార్ట్​ సేల్​లో భాగంగా రూ .9,499 లకే అమ్ముడవుతోంది.


Poco M3

ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో పోకో ఎం 3 స్మార్ట్​ఫోన్​ కొసుగోలు చేసేవారికి రూ .500 డిస్కౌంట్​ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ కార్నివల్​ సేల్​లో దీన్ని కేవలం రూ .10,999 లకే విక్రయిస్తున్నారు.


Realme C12

ఫ్లిప్​కార్ట్​ కార్నివల్​ సేల్​లో రియల్‌మీ సి 12 (3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) వేరియంట్ రూ .7,999 నుండి రూ .8,999 ధర వద్ద అమ్ముడవుతోంది.


iPhone 12 Pro Max

ఫ్లిప్​కార్ట్​ కార్నివల్ సేల్​లో భాగంగా ఐఫోన్ 12 ప్రో మాక్స్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ఉపయోగించే చేసే కొనుగోలుపై రూ .5 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. తద్వారా, ఐఫోన్ 12 ప్రో మాక్స్ వేరియంట్​ను రూ.1,22,900లకే కొనుగోలు చేయవచ్చు.


Apple iPhone 11:

ఫ్లిప్​కార్ట్ కార్నివల్ సేల్​లో భాగంగా ఐఫోన్ 11 (రివ్యూ) వేరియంట్​ను బట్టి రూ .44,999 నుండి రూ. 54,900 మధ్య అమ్ముడవుతోంది.


Xiaomi Mi 10T

షియోమి ఎంఐ 10 టి 5జీ వేరియంట్​ రూ .32,999 నుండి రూ. 34,999 మధ్య అమ్ముడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేస్తే రూ .2,500 డిస్కౌంట్​ పొందవచ్చు.


Realme 7:

ఫ్లిప్​కార్ట్ కార్నివల్ సేల్​లో భాగంగా రియల్‌మీ 7 (రివ్యూ) రూ .14,999 నుండి రూ .13,499 మధ్య అమ్ముడవుతోంది.


iQOO 3:

ఐక్యూ 3 (రివ్యూ) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ .36,990 నుండి రూ .24,990 మధ్య అమ్ముడవుతోంది.


Realme Narzo 30A:

రియల్‌మీ నార్జో 30 ఎ (రివ్యూ)పై రూ.500 డిస్కౌంట్​ లభిస్తుంది. దీని అసలు ధర రూ .8,499గా ఉండగా.. సేల్​లో భాగంగా దీన్ని రూ. 8,999లకే కొనుగోలు చేయవచ్చు.


Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు