• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FLIPKART SMARTPACK SUBSCRIPTION TO LAUNCH ON 2021 JANUARY 17 KNOW HOW TO GET 100 PER CENT MONEYBACK WITH SUBSCRIPTION PLANS SS

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి (image: Flipkart)

Flipkart Smartphone Offer | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ 100 శాతం మనీ బ్యాక్ అందిస్తోంది.

  • Share this:
    ఫ్లిప్‌కార్ట్‌లో మీరు కొనే స్మార్ట్‌ఫోన్‌పై 100 శాతం వరకు మనీ బ్యాక్ పొందొచ్చు. అంటే మీరు రూ.10,000 విలువైన స్మార్ట్‌ఫోన్ కొన్నారంటే అంతే మొత్తం మనీబ్యాక్ పొందొచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్ మీకు ఫ్రీగా వచ్చినట్టే. ఇలా 100 శాతం వరకు మనీ బ్యాక్ పొందాలంటే మీరు 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ప్రారంభించిన సర్వీస్ ఇది. కస్టమర్లు ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఫోన్ కొనాలి. 12 లేదా 18 నెలలు 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫోన్ తిరిగి ఇచ్చేయాలి. మీరు మొదట ఫోన్ కోసం చెల్లించిన మొత్తం వెనక్కి వస్తుంది. అంటే ఇప్పుడు రూ.10,000 చెల్లించి ఫోన్ కొంటే 12 నెలల తర్వాత మీకు రూ.10,000 వెనక్కి వస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు ఉచితంగా వచ్చినట్టే. 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ రూ.6,000 నుంచి రూ.17,000 మధ్య ఉండే స్మార్ట్‌ఫోన్లకు వర్తిస్తుంది. షావోమీ, రియల్‌మీ, పోకో, సాంసంగ్, మోటోరోలా, ఒప్పో, వివో లాంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు కొనొచ్చు.

    Samsung Galaxy M02s: సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ ఫస్ట్ సేల్‌ డేట్ ప్రకటించిన అమెజాన్

    Jio Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

    'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ 2021 జనవరి 17న ప్రారంభం అవుతుంది. ఫోన్‌తో పాటు స్మార్ట్‌ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. మూడు రకాల స్మార్ట్‌ప్యాక్స్ ఉన్నాయి. ప్రతీ నెల బ్రాంజ్ ప్లాన్‌కు రూ.399, సిల్వర్ ప్లాన్‌కు రూ.699, గోల్డ్ ప్లాన్‌కు రూ.879 చెల్లించాలి. ఈ స్మార్ట్‌ప్యాక్ తీసుకునేవారికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. సోనీలివ్ ప్రీమియం, జీ5 ప్రీమియం, వూట్ సెలెక్ట్, జొమాటో ప్రో, కల్ట్ ఫిట్ లైవ్, ప్రాక్టో ప్లస్ లాంటి సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ పూర్తైన తర్వాత మీ ఫోన్‌ తిరిగి ఇచ్చేయాలి. ఫోన్ తిరిగి ఇచ్చేప్పుడు డిస్‌ప్లే బాగుండాలి. ఐఎంఈఐ నెంబర్ కనిపించాలి. ఈ రెండు బాగుంటే 100 శాతం వరకు డబ్బు వెనక్కి వస్తుంది. అంటే మీరు చెల్లిస్తున్నది ఈ ప్లాన్స్‌కు మాత్రమే. బ్రాంజ్ ప్లాన్‌కు 60 శాతం, సిల్వర్ ప్లాన్‌కు 80 శాతం, గోల్డ్ ప్లాన్‌కు 100 శాతం మనీ బ్యాక్ వస్తుంది.

    Jio 28 days plans: 28 రోజుల వేలిడిటీ కావాలా? జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే...

    Paytm Instant Personal Loan: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్


    'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ నియమనిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నియమనిబంధనలతో పాటు ఉదాహరణలు కూడా వివరించింది ఫ్లిప్‌కార్ట్. ఉదాహరణకు ఒకరు రూ.10,000 విలువైన స్మార్ట్‌ఫోన్ 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ కొన్నారనుకుందాం. మొదట ఫోన్ ధరతో పాటు ఎంచుకున్న ప్లాన్ డబ్బులు కూడా చెల్లించాలి. గోల్డ్ ప్లాన్ ఎంచుకుంటే రూ.10,000+రూ.879 చెల్లించాలి. 12 నెలలు లేదా 18 నెలలు ఇందులో ఏది ఎంచుకుంటే ప్రతీ నెల రూ.879 చొప్పున చెల్లించాలి. సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత ఫోన్ తిరిగి ఇచ్చేయాలి. గోల్డ్ ప్లాన్ ఎంచుకున్నారు కాబట్టి రూ.10,000 మనీ బ్యాక్ వస్తుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా డిస్కౌంట్ పొందినా 'ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ప్యాక్' సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: