హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Dussehra Sale: అసలు సిసలైన ఆఫర్.. రూ.699కే ఐరన్ బాక్స్+ట్రిమ్మర్ రెండూ పొందండి!

Flipkart Big Dussehra Sale: అసలు సిసలైన ఆఫర్.. రూ.699కే ఐరన్ బాక్స్+ట్రిమ్మర్ రెండూ పొందండి!

అసలు సిసలైన ఆఫర్.. రూ.699కే ఐరన్ బాక్స్+ట్రిమ్మర్ రెండూ పొందండి!

అసలు సిసలైన ఆఫర్.. రూ.699కే ఐరన్ బాక్స్+ట్రిమ్మర్ రెండూ పొందండి!

Big Dussehra Sale | ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కాంబో డీల్ అందుబాటులో ఉంది. ఐరన్ బాక్స్, ట్రిమ్మర్ రెండింటినీ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ రెండింటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Flipkart Offer | దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ పండుగ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. బిగ్ బిలియన్ డేస్ తర్వాత మళ్లీ బిగ్ దసరా సేల్‌ (Big Dussehra Sale) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు పలు రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. టీవీలు, మొబైల్స్ (Smartphones), ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వంటింటి వస్తువులు ఇలా చాలా వాటిపై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  ఇప్పుడు మనం ఒక కాంబో డీల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే కాంబో డీల్ లభిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ ధరకే ఐరన్ బాక్స్, ట్రిమ్మర్ కొనుగోలు చేయొచ్చు. కేవలం రూ. 699కే ఈ రెండు ప్రొడక్టులను కొనొచ్చు. ఈ కాంబో డీల్ విలువ సాధారణంగా రూ. 2,078గా ఉంది. అయితే సేల్‌లో రూ. 699కే సొంతం చేసుకోవచ్చ. అంటే 66 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

  లైఫ్‌లాంగ్ కంపెనీకి చెందిన ఈ ప్రొడక్టుల విషయానికి వస్తే.. ట్రిమ్మర్‌లో క్విక్ చార్జ్ ఫీచర్ ఉంది. దీన్ని 60 నిమిషాలు ఏకదాటిగా ఉపయోగించొచ్చు. 0.5 నుంచి 20 ఎంఎం వరకు కాంబ్ సెట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ లెంత్, ఫ్లెక్సిబిలిటీ, కంట్రోల్ వంటివి ఈ ట్రిమ్మర్ సొంతం. ఇందులో హైగ్రేడ్ స్టీల్ బ్లేడ్లను అమర్చారు. యూఎస్‌బీ చార్జర్ ఉంటుంది.

  దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

  ఇక ఐరన్ బాక్స్ విషయానికి వస్తే.. ఇందులో హెరిటేజ్ కోటింగ్ ఉంటుంది. సేఫ్ అండ్ స్ట్రాంగ్. ఓవర్ హీట్ సేఫ్టీ షట్ ఆఫ్, 360 డిగ్రీ స్వివెల్ కోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రిమ్మర్, ఐరన్ బాక్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.

  కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్లపై కూడా కళ్లుచెదిరే డీల్స్ పొందొచ్చు. వాషింగ్ మెషీన్లను రూ. 5 వేల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఫ్రిజ్‌లపై కూడా సూపర్ డీల్స్ లభిస్తున్నాయి. కాగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ దసరా సేల్ అక్టోబర్ 8 వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోండి. మరోవైపు మరో దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా ఆఫర్ల సేల్ కొనసాగుతోంది. మీరు అమెజాన్‌లో కూడా షాపింగ్ చేసి, ఆకర్షణీయ డిస్కౌంట్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే వారికి అదనపు తగ్గింపు లభిస్తోంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Amazon, Flipkart, Flipkart Big Billion Days, Latest offers, Offers

  ఉత్తమ కథలు