ఈ-కామర్స్ దిగ్గజాలపై ఫ్లిప్ కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) వరుస ఆఫర్లలో వినియోగదారులకు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ మరో సేల్ ను ప్రారంభించింది. రియల్ మీ డేస్ సేల్ (Flipkart Realme Days Sale) తో నిర్వహిస్తున్న ఈ సేల్ లో రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ రోజు అంటే ఈ నెల 19న ప్రారంభమైన ఈ సేల్ ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 24న ముగియనున్న ఈ సేల్ లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. realme C30s స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా.. ఈఫర్లలో రూ.6,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై అసలు ధరపై 25 శాతం డిస్కౌంట్ ఉంది. ఇంకా అనేక బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే రూ.6,499కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా ఈ ఫోన్ పై రూ.6,950 ఎక్సేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ మోడల్ కొత్తది అయి.. కండిషన్ బాగుంటే ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తుంది. ఆ ఆఫర్ తో కేవలం రూ.550కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
Realme c31 ఫోన్ పై సైతం రియల్ మీ డేస్ సేల్ లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా.. ఆఫర్లో రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై రూ.8700 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Mobile offers, Smartphone