FLIPKART OFFERS WOMENS DAY SALE ON FLIPKART CHECK HERE FULL OFFERS DETAILS HERE RA
Flipkart Women's Day sale : విమెన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్స్..
విమెన్స్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో కొన్నింటికే రేపే గడువు ముగుస్తోంది.. ఆ వివరాలు..
మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఫేమస్ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, టీవీలపై డిస్కౌంట్ల వర్షం కురిపించింది. దీంతో.. హానర్ 9N, నోకియా 6.1 ప్లస్, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8, వీవో V9 ప్రో Poco F1, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 8, మరియు మోటరోలా వన్ పవర్ వంటి హ్యాండ్సెట్లు డిస్కౌంట్ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. కేవలం ఇవే కాదు.. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, కెమెరాలు, పవర్ బ్యాంక్స్ సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా దాదాపు 80శాతం డిస్కౌంట్ ఉంది.
ఆనర్ 9N అసలు ధర రూ.11,999 కాగా.. ఆఫర్లో రూ9,999కే లభిస్తుంది. నోకియా 6.1 అసలు ధర రూ.15,499 ఉండగా.. రూ13,999కే లభిస్తుంది. ఇక వివో v9 ప్రో రూ.2వేల డిస్కౌంట్‌తో రూ.13,990కి లభిస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ S8 రూ.30,990కే పొందొచ్చు. జెన్‌ఫోన్ లైట్ ఎల్ 1 అత్యధికంగా రూ.4,999 డిస్కౌంట్‌పై లభించనుంది. గూగుల్ పిక్సెల్ 64జీబీ రూ.71వేల నుంచి రూ.59,999 కే అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ ప్రో 8జీ ర్యామ్ రూ.12,990కే లభిస్తుంది. మొటరోలో వన్ పవర్.. రూ తగ్గింపుతో రూ.13,999కే లభిస్తుంది.
అదే విధంగా.. టీవీలపై 75శాతం డిస్కౌంట్ లభిస్తుంది. MarQ 32 inch HD Smart Tv లపై ఆఫర్స్ నడుస్తున్నాయి. VU Full HD 43 Inch LED Tv రూ.17,499కే లభిస్తుంది.
మరిన్నీ ఆఫర్స్ కూడా మీరూ సైట్‌కి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.