Home /News /technology /

FLIPKART OFFERS UP TO RS 25240 EXCHANGE DISCOUNT ON IPHONE 12 MINI BUYERS KNOW OFFER DETAILS SS GH

iPhone 12 Mini: ఐఫోన్​ 12 మినీ కొనేవారికి ఫ్లిప్​కార్ట్ బంపరాఫర్​... పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్​పై రూ.25,240 వరకు డిస్కౌంట్

iPhone 12 Mini: ఐఫోన్​ 12 మినీ కొనేవారికి ఫ్లిప్​కార్ట్ బంపరాఫర్​... పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్​పై రూ.25,240 వరకు డిస్కౌంట్
(ప్రతీకాత్మక చిత్రం)

iPhone 12 Mini: ఐఫోన్​ 12 మినీ కొనేవారికి ఫ్లిప్​కార్ట్ బంపరాఫర్​... పాత ఫోన్​ ఎక్స్ఛేంజ్​పై రూ.25,240 వరకు డిస్కౌంట్ (ప్రతీకాత్మక చిత్రం)

iPhone 12 Mini | మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నారా? ఆఫర్‌లో ఐఫోన్ (iPhone Offer) కొనే ఆలోచనలో ఉన్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఐఫోన్ 12 మినీ కొంటే రూ.25,240 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఇంకా చదవండి ...
మీరు కొత్త ఐఫోన్​ 12 కొనాలని చూస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ–కామర్స్​ దిగ్గజం​ ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​లో యాపిల్​ ఐఫోన్ 12 మిని (iPhone 12 Mini) మోడల్​పై బంపరాఫర్​ ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ మోడల్​పై ఏకంగా రూ. 25,240 డిస్కౌంట్​ (Exchange Discount) పొందవచ్చు. ప్రస్తుతం ఐఫోన్​ 12 మిని స్మార్ట్‌ఫోన్​ రూ. 60,000 ధర వద్ద విక్రయానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్​లో ఐఫోన్ 12 మినీ ఎక్స్ఛేంజ్​పై గరిష్టంగా రూ.15,000 తగ్గింపు పొందవచ్చు. మిగతా ఆఫర్లన్నీ కలుపుకుంటే దీన్ని కేవలం రూ. 40,249 వద్ద కొనుగోలు చేయవచ్చు. అందువల్ల, మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్​ నుంచి ఐఫోన్​కు అప్​గ్రేడ్​ కావాలన్నా? పాత ఐఫోన్​ ఎస్​ఈ, ఐఫోన్​ 8, ఐఫోన్​ 7 మోడళ్లను నుంచి​ కొత్త ఐఫోన్​ మోడల్​కు అప్​గ్రేడ్​ కావాలన్నా? ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు.

Xiaomi 11T Pro 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.4,500 డిస్కౌంట్

ఐఫోన్​ 12 మినీపై డిస్కౌంట్​


మీరు ఎక్స్ఛేంజ్​ చేసుకునే ఫోన్​ మోడల్​పై డిస్కౌంట్​ఆధారపడి ఉంటుంది. ఇలా ఐఫోన్​ 12 మినీపై గరిష్టంగా రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు. ఉదాహరణకు, మీరు పాత ఐఫోన్​ SE 2020​ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. రూ. 6,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. ఇక, ఐఫోన్​ 11 ఎక్స్​ఛేంజ్​ చేస్తే రూ.10,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. ఒకవేళ, ఐఫోన్​ ఎక్స్​ఆర్​ బేస్​ వేరియంట్​ను ఎక్స్ఛేంజ్​ చేయడం ద్వారా రూ. 15 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇలా మీ పాత ఐఫోన్, ఇతర ఆండ్రాయిడ్​ ఫోన్లను ఎక్స్ఛేంజ్​ చేసుకొని కొత్త ఐఫోన్​ మోడల్​కు అప్​గ్రేడ్​ అవ్వొచ్చు.

Tecno Pop 5 Pro: భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్స్‌తో టెక్నో పాప్ 5 ప్రో రిలీజ్... ధర రూ.10,000 లోపే

ఐఫోన్​ SE 2020, ఐఫోన్​ 7 వంటి పాత మోడళ్లతో పోలిస్తే, ఐఫోన్​ 12 మిని ఖచ్చితంగా పెద్ద అప్‌గ్రేడ్ అనే చెప్పవచ్చు. ఈ ఫోన్ 5.4 అంగుళాల ఓఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్​ప్లే సూపర్ రెటినా ఎక్స్​ఆర్​డి డిస్​ప్లేను పోలి ఉంటుంది. ఐఫోన్​ 12 మినీ ఫేస్ ఐడీ సిస్టమ్‌కు మద్దతిస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇది​ A14 బయోనిక్​ చిప్‌సెట్​తో పనిచేస్తుంది. ఐఫోన్​ 12 మినీ మ్యాగ్​సేఫ్​ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ ఫోన్​ నీలం, ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Flipkart, Iphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు