ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flipkart) మరో ఆఫర్ సేల్‌ను(Offer Sale) ప్రకటించింది. తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా పోకో(Poco) నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను (Discounts) అందిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G), పోకో ఎమ్4 ప్రో 5జీ (Poco M4 Pro 5G), పోకో ఎమ్4 ప్రో (Poco M4 Pro) వంటి ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. మంచి ఆఫర్‌లో టాప్ రేంజ్(Top Range), మిడ్ రేంజ్ ఫోన్లను(Mid Range Phones) కొనుగోలు చేయాలని ఎదురుచూసేవారు.. ఈ ఆఫర్ సేల్‌లో(Offer Sale) తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా పోకో హ్యాండ్‌సెట్‌లపై(Poco Handset) అందుబాటులో ఉన్న డీల్స్(Deals), డిస్కౌంట్స్ ఏవో చూద్దాం.
* పోకో X4 ప్రో 5G (Poco X4 Pro 5G)
పోకో X4 ప్రో డివైజ్ అన్ని వేరియంట్లపై ఆఫర్లు ఉన్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఫ్లాట్ రూ. 1,000 డిస్కౌంట్ ఉంది. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొనుగోలు చేసేవారు మరో రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో పోకో X4 ప్రో 6GB + 64GB వేరియంట్‌ను రూ. 16,499కి కొనుగోలు చేయవచ్చు. అయితే అన్ని డిస్కౌంట్లు కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్‌ల ధర రూ. 17,499, రూ. 19,499గా ఉంది.
* పోకో M4 ప్రో 5G (Poco M4 Pro 5G)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుండగా, అన్నింటిపై ఫ్లాట్ రూ. 1,000 డిస్కౌంట్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవారు అదనంగా రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో కలిపి పోకో M4 ప్రో 4GB + 64GB వేరియంట్ రూ. 2,000 డిస్కౌంట్‌తో రూ. 12,999కి లభిస్తుంది. 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లను రూ.14,999, రూ.16,999కి సొంతం చేసుకోవచ్చు.
* పోకో M4 ప్రో (Poco M4 Pro)
పోకో M4 ప్రో కొనుగోలుపై పోకో ఇండియా రూ. 3,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.1,500 డిస్కౌంట్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పేమెంట్‌తో మరో రూ.1,000 తగ్గింపు ఉంది. SBI క్రెడిట్ కార్డ్‌లతో ట్రాన్సాక్షన్స్ చేసేవారు అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో పోకో M4 ప్రో ఫోన్ 6GB + 64GB వేరియంట్‌ను రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Mobile phone, POCO, Smartphones, Summer sale