Flipkart Offer: డబ్బుల్లేవా..? అయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు ఇలా...

Flipkart Pay later | ఫ్లిప్‌కార్ట్ బయ్ నౌ పే లేటర్ ద్వారా డబ్బులు లేకపోయినా రూ.5,000 వరకు కస్టమర్లు షాపింగ్ చేయొచ్చు. బిల్లు చెల్లించడానికి 40 రోజుల గడువు ఉంటుంది.

news18-telugu
Updated: September 18, 2019, 5:37 PM IST
Flipkart Offer: డబ్బుల్లేవా..? అయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు ఇలా...
Flipkart Offer: డబ్బుల్లేవా..? అయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసి తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, కార్డ్‌లెస్ క్రెడిట్ ద్వారా కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న సేవలు ఇవి. ఇలాంటి ఫిన్‌టెక్ సేవల ద్వారా సేల్స్ పెంచుకుంటోంది ఫ్లిప్‌కార్ట్. గత ఫెస్టివల్ సీజన్‌ నుంచి ఇప్పటి వరకు కస్టమర్లకు మూడు రెట్లు ఎక్కువగా ఫిన్‌టెక్ సేవలు అందించినట్టు వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. ఎవరైనా కస్టమర్లు డబ్బులు లేకపోయినా తమకు నచ్చిన వస్తువులు కొనే అవకాశాన్ని ఫిన్‌టెక్ సర్వీస్ ద్వారా కల్పిస్తోంది. ఫ్యాషన్ వేర్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ లాంటివాటిని ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, కార్డ్‌లెస్ క్రెడిట్ ద్వారా కొనొచ్చు. రాబోయే దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్‌లో ఈ సదుపాయం కస్టమర్లకు బాగా ఉపయోపడనుంది.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని కస్టమర్లకు కూడా అప్పు ఇవ్వడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకునే అవకాశాన్ని లక్షలాది మంది భారతీయులకు కల్పిస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మరింత మంది కస్టమర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

రంజిత్ బోయనపల్లి, హెడ్-ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్, ఫ్లిప్‌కార్ట్


ఫ్లిప్‌కార్ట్ బయ్ నౌ పే లేటర్ ద్వారా డబ్బులు లేకపోయినా రూ.5,000 వరకు కస్టమర్లు షాపింగ్ చేయొచ్చు. బిల్లు చెల్లించడానికి 40 రోజుల గడువు ఉంటుంది. 40 రోజుల లోపు చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం ఛార్జీలు తప్పవు. మీరు ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్తే పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. పే లేటర్ ఆప్షన్ ఎంచుకొని డబ్బులు చెల్లించకుండా ఆర్డర్ పూర్తి చేయొచ్చు. ఇక కార్డ్‌లెస్ క్రెడిట్ అయితే ఏకంగా రూ.100,000 వరకు షాపింగ్ చేయొచ్చు. నెలనెలా వాయిదాల్లో డబ్బులు తిరిగి చెల్లించొచ్చు. ఈఎంఐలు చెల్లించడానికి గరిష్టంగా 12 నెలల గడువు ఉంటుంది. ఇక ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంకుతో కలిసి క్రెడిట్ కార్డును కూడా లాంఛ్ చేసింది.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:Best Smartphones: ఆన్‌లైన్‌ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్

Zomato Originals: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్... యాప్‌లో వీడియోలూ చూడొచ్చు
Published by: Santhosh Kumar S
First published: September 18, 2019, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading