హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart TV Offers: బ్యాంక్ బంపరాఫర్.. నెలకు రూ.264తో స్మార్ట్‌టీవీ కొనొచ్చు!

Smart TV Offers: బ్యాంక్ బంపరాఫర్.. నెలకు రూ.264తో స్మార్ట్‌టీవీ కొనొచ్చు!

Smart TV Offers: బ్యాంక్ బంపరాఫర్.. నెలకు రూ.264తో స్మార్ట్‌టీవీ కొనొచ్చు!

Smart TV Offers: బ్యాంక్ బంపరాఫర్.. నెలకు రూ.264తో స్మార్ట్‌టీవీ కొనొచ్చు!

Flipkart Sale | కొత్త టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం ఒక ఆఫఱ్ అందుబాటులో ఉంది. తక్కువ ఈఎంఐతోనే అదిరే టీవీ కొనుగోలు చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Flipkart Offers | టీవీ కొనే వారికి సూపర్ డీల్ అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) స్మార్ట్ టీవీపై (Smart TV) అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. కేవలం రూ. 264 ఈఎంఐలో మీరు అదిరే స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో బీతోఎస్ఓఎల్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీని ఎంఆర్‌పీ రూ. 19 వేలుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు సేల్‌లో రూ. 7499తో కొనొచ్చు. అంటే మీరు నేరుగానే 60 శాతం తగ్గింపు వస్తోంది. 32 ఇంచుల స్మార్ట్ టీవీకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టీవీని మీరు ఇంకా తక్కువ ధరకే పొందొచ్చు. రూ. 7124 ధరకే కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 375 తగ్గింపు వస్తుంది.

స్మార్ట్‌టీవీ ధర రూ.42 వేలు.. కానీ రూ.13,394కే కొనేయండిలా!

అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు కేవలం రూ. 264 చెల్లిస్తే సరిపోతుంది. ఈ టీవీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ ఆఫర్ కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టీవీ కొంటే ఈ ఆఫర్ వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ. 264 నుంచి ప్రారంభం అవుతోంది.

నెలకు రూ.2 వేలతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి. వెళ్లొచ్చు!

ఈ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 24 వాట్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ టీవీ, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్నింటినీ ఈ స్మార్ట్ టీవీలో చూడొచ్చు. అంటే ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు 36 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 264 చెల్లించొచ్చు. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 368 చెల్లించాలి. ఇక 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 468 పడుతుంది. 9 నెలల ఈఎంఐ పెట్టుకుంటే.. రూ. 883 ఈఎంఐ పడుతుంది. 6 నెలలకు రూ. 1300 కట్టాలి. అదే మూడు నెలల ఈఎంఐ టెన్యూర్ అయితే నెలకు రూ. 2,555 చెల్లించాల్సి వస్తుంది. ఇకపోతే ఈఎంఐ లావాదేవీలపై రూ. 199 ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు ఉంటాయి.

First published:

Tags: Budget smart tv, Flipkart, Flipkart offers, Smart TV, Smart tvs