Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు ఇవే

Flipkart National Shopping Days Sale | కొత్తగా లాంఛ్ చేసిన సాంసంగ్ 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ టీవీ, వాల్‌పూల్ 195 లీటర్ల రిఫ్రిజిరేటర్‌, 32 అంగుళాల ఎంఐ 4ఏ ప్రో ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌జీ 6.5 కేజీ వాషింగ్ మెషీన్‌తో పాటు అనేక ఉత్పత్తులపై భారీ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: August 7, 2019, 5:08 PM IST
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు ఇవే
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు ఇవే
  • Share this:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో 'నేషనల్ షాపింగ్ డేస్ సేల్' జరగబోతోంది. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 10 వరకు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు 'నేషనల్ షాపింగ్ డేస్ సేల్' ఆగస్ట్ 7 రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, టెలివిజన్లతో పాటు అనేక ఉత్పత్తులపై భారీ ఆఫర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్ల విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 7ఎస్, ఒప్పో కే1, ఏసుస్ జెన్‌ఫోన్ 5జీ, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, హానర్ 20ఐ, నోకియా 6.1 ప్లస్, హానర్ 9 లైట్‌తో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్ నుంచి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.టీవీలపై 75% వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు తగ్గింపు అందించనుంది ఫ్లిప్‌కార్ట్. హోమ్ అప్లయెన్సెస్‌పైనా భారీ తగ్గింపు ఉండబోతోంది.

కొత్తగా లాంఛ్ చేసిన సాంసంగ్ 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ టీవీ, వాల్‌పూల్ 195 లీటర్ల రిఫ్రిజిరేటర్‌, 32 అంగుళాల ఎంఐ 4ఏ ప్రో ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌జీ 6.5 కేజీ వాషింగ్ మెషీన్‌తో పాటు అనేక ఉత్పత్తులపై భారీ ఆఫర్లున్నాయి. కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్‌పైనా డిస్కౌంట్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొన్నవారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?EPF Withdraw: ఏ కారణానికి ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: August 7, 2019, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading