Home /News /technology /

FLIPKART MOBILES BONANZA SALE STARTED IN INDIA INDIA HERE IS THE LIST OF BEST PHONES UNDER RS 20000 NS

Flipkart Mobiles Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్ లో మొబైల్స్ బోనాంజా సేల్.. రూ. 20 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్ కార్ట్ లో ‘మొబైల్ బోనాంజా’(Mobiles Bonanza) సేల్ నిర్వహిస్తున్నారు. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై(Smartphones) భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ‘మొబైల్స్ బోనాంజా’(Mobiles Bonanza) పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ లో మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ అందించనున్నారు. ఈ సేల్ ఈ రోజు అంటే నవంబర్ 17న ప్రారంభైంది. నవంబర్ 21వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో మొబైల్స్ పై డిస్కౌంట్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్ ఆఫర్లు ఉన్నాయి. మీరు ఒక వేళ రూ. 20 వేల కన్నా తక్కువ ధరలో మొబైల్ కొనాలని ప్లాన్ చేసుకుంటే.. ఈ సేల్ లో మీ బడ్జెట్ కు తగిన బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోన్ల వివరాలు మీ కోసం..

    Realme 8 5G: ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఈ ఫోన్ 64 జీబీ బేస్ మోడల్ రూ. 15, 499 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను వెనకవైపు కలిగి ఉంటుంది. ఇంకా 5000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
    iPhone 13: ఐఫోన్​​ లవర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఐఫోన్​ 13పై ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్​

    Redmi Note 10T 5G: మీరు ఈ 5G ఫోన్ ను ఈ సేల్ లో రూ. 16, 990 కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6.5 అంగుళాల డిస్ప్లనే కలిగి ఉంటుంది. ఇంకా 90Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇంకా 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇంకా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. దీంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
    Redmi Note 11T 5G: నెలాఖరులో రెడ్ మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న నోట్‌ 11T 5G

    Poco M3 Pro 5G: ఈ 5G ఫోన్ ను ఈ సేల్ లో రూ. 14, 499కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.53 అంగుళాల Full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇంకా 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జిగ్ ను సపోర్ట్ చేస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు