Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్

Flipkart Mobiles Bonanza Sale | యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించినవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్ ఎంచుకుంటే అదనంగా రూ.250 తగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: June 18, 2019, 12:17 PM IST
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ (image: Flipkart)
news18-telugu
Updated: June 18, 2019, 12:17 PM IST
ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. జూన్ 21 వరకు ఈ సేల్ కొనసాగనుంది. షావోమీ, సాంసంగ్, హానర్, ఏసుస్, నోకియా లాంటి పెద్దపెద్ద బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. అంతేకాదు ఐదు రోజుల సేల్‌లో డిస్కౌంట్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించినవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్ ఎంచుకుంటే అదనంగా రూ.250 తగ్గింపు లభిస్తుంది. మరి ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో ఆఫర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.

Apple iPhone X: యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఇండియాలో లాంఛ్ చేసినప్పుడు 64 జీబీ మోడల్ ధర రూ.89,000. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.66,499 ధరకే కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Nokia 6.1: నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999 ధరకే కొనొచ్చు.

Asus 5Z: త్వరలో ఏసుస్ 6జీ లాంఛ్ కానుండటంతో ఏసుస్ 5జెడ్‌ ఆఫర్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 కాగా ఆఫర్‌లో రూ.21,999 ధరకే కొనొచ్చు.



Oppo K1: ఒప్పో కే1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,990 కాగా ఆఫర్‌లో రూ.13,990 ధరకే లభిస్తుంది.

Redmi Note 6 Pro: రెడ్‌మీ నోట్ 6 ప్రో 6జీబీ వేరియంట్‌పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ.13,999 ధరకు కనొచ్చు.

Xiaomi Redmi 6: షావోమీ రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ+64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,499 ధరకే అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.
Loading...
Redmi Note 5 Pro: రెడ్‌మీ 7 సిరీస్ రిలీజైనా ఇప్పటికీ రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్‌కు డిమాండ్ ఉంది. ఈ ఫోన్‌ను రూ.11,999 ధరకే కొనొచ్చు.

Samsung Galaxy A50: సాంసంగ్ గెలాక్సీ ఏ50 ధరను తగ్గించి రూ.18,490 ధరకే ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్.

Honor 9N: హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్‌లో రూ.8,999 ధరకే కొనొచ్చు.

Asus ZenFone Max Pro M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ మోడల్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్‌లో రూ.8,499 ధరకే కొనొచ్చు.

Honor 10 Lite: హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్‌లో రూ.9,999 ధరకే కొనొచ్చు.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Jio Cricket: మై జియో యాప్‌లో క్రికెట్ కాంటెస్ట్... ఆడండి ఇలా

Xiaomi: షావోమీ, రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...