ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బోనాంజా సేల్ (Flipkart Mobile Bonanza Sale) ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సేల్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై (Smart Phones) సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Realme C30s స్మార్ట్ ఫోన్ పై బెస్ట్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.9,999. ఈ ఫోన్ పై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ఎవరైనా ఈ ఫోన్ ను రూ.3 వేల తగ్గింపుతో రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై 5 శాతం తగ్గింపు ఉంది.
ఇంకా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్ పై రూ.700 తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ తో రూ.6299 కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేసి రూ.6,450 అదనపు తగ్గింపు అందుకోవచ్చు. మీ ఫోన్ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. కేవలం రూ.549కే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
- ఈ ఫోన్ 2జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- ఇంకా ఈ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది.
- ఇంకా ఈ ఫోన్ 8MP రేర్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
- 5000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile offers, Real me, Smartphones