నేటి నుంచే ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2, నోకియా 6.1 ప్లస్, హానర్ 7ఎస్, రియల్‌మీ సీ1, రియల్‌మీ 2, మోటోరోలా వన్ పవర్‌పై ఆఫర్లున్నాయి. నేడు(డిసెంబర్ 26న) మొదలయ్యే ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌ డిసెంబర్ 29న ముగుస్తుంది.

news18-telugu
Updated: December 26, 2018, 7:18 AM IST
నేటి నుంచే ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...
Flipkart Mobile Bonanza: డిసెంబర్ 26 నుంచి 29 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా
  • Share this:
మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఇప్పటికే కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచేశాయి. ఇంకా పెరిగే అవకాశముంది. ఇలాంటి టైమ్‌లో ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా పేరుతో సేల్ నిర్వహిస్తోంది. సరిగ్గా ఏడాది ముగిసే సమయంలో కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ ఇవాళ(డిసెంబర్ 26) నుంచి 29 వరకు జరగనుంది. రియల్‌మీ 2 ప్రో, ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, నోకియా 5.1 ప్లస్, హానర్ 9ఎన్ లాంటి ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది.

Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి | Flipkart Mobile Bonanza: Huge discounts, offers on Smartphones... Know what to buy?
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1


ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1: ఏసుస్ నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్లల్లో ఇది ఒకటి. ప్రస్తుతం ప్రారంభ ధర రూ.10,999. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో రూ.8,999 ధరకే లభించనుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్, ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 5000 ఎంఏహెచ్, సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, కలర్: బ్లాక్, గ్రే, సిమ్: డ్యూయెల్ సిమ్.

Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి | Flipkart Mobile Bonanza: Huge discounts, offers on Smartphones... Know what to buy?
ప్రతీకాత్మక చిత్రం


నోకియా 5.1: ఈ ఫోన్ రూ.9,999 ధరకే లభించనుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 5.8 అంగుళాలు, ర్యామ్: 3 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60, రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్.

Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి | Flipkart Mobile Bonanza: Huge discounts, offers on Smartphones... Know what to buy?
రియల్‌మీ2 ప్రో


రియల్‌మీ 2 ప్రో: రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన ఈ ఫోన్ ఇప్పుడు ఆఫర్‌పై లభిస్తోంది. అసలు ధర రూ.13,990 కాగా ఆఫర్ ధర రూ.12,990. స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ, ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660, రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3500 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.2.

Flipkart Mobile Bonanza: ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్? తెలుసుకోండి | Flipkart Mobile Bonanza: Huge discounts, offers on Smartphones... Know what to buy?
హానర్ 9ఎన్


హానర్ 9ఎన్: ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,999. ఈ ఫోన్ డిస్‌ప్లే: 5.84 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 19:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 3జీబీ, 4జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ, 128జీబీ, ప్రాసెసర్: కిరిన్ 659, రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఈఎంయూఐ 8.0, కలర్స్: బ్లాక్, బ్లూ, పర్పుల్, లైమ్, జాస్పర్ గ్రీన్.

వీటితో పాటు ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2, నోకియా 6.1 ప్లస్, హానర్ 7ఎస్, రియల్‌మీ సీ1, రియల్‌మీ 2, మోటోరోలా వన్ పవర్‌పై ఆఫర్లున్నాయి. డిసెంబర్ 26న మొదలయ్యే ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌ డిసెంబర్ 29న ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్ల కథేంటో తెలుసా?

ఎస్‌బీఐ కార్డులు మార్చుకోవడానికి వారమే గడువు... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

కొత్త ఫోన్ కొంటారా? భారీ డిస్కౌంట్‌తో రియల్‌మీ యూ1

ALERT: ఎస్‌బీఐ విత్‌డ్రా, డిపాజిట్ రూల్స్ మారాయి తెలుసా?

క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కే

ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు
Published by: Santhosh Kumar S
First published: December 26, 2018, 6:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading