news18-telugu
Updated: August 16, 2019, 12:35 PM IST
Flipkart Videos: గుడ్ న్యూస్... ఫ్లిప్‌కార్ట్‌లో సినిమాలు వచ్చేశాయి
అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందిస్తోంది. స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే వీడియో కంటెంట్ ఆఫర్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ లాంఛ్ కావడానికి ఇంకా సమయం పట్టొచ్చని అందరూ అనుకుంటూ ఉండగానే, యాప్‌లో Videos సెక్షన్‌ను లాంఛ్ చేసింది ఫ్లిప్‌కార్ట్. ఏ హడావుడి, ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ సర్వీస్ లాంఛ్ చేసి యూజర్లను ఆశ్చర్యపర్చింది ఫ్లిప్‌కార్ట్.

ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ సర్వీస్ ఉచితంగా వాడుకోవచ్చు. Voot, Viu, Dice Media, TVF, Arre లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో కంటెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో బాలీవుడ్ సినిమాలు, హిందీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కనిపిస్తోంది. తెలుగు భాషలో ఎలాంటి కంటెంట్ లేదు. మరి భవిష్యత్తులో తెలుగు కంటెంట్‌ని కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుందో లేదో చూడాలి. ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఐడియాస్ కూడా లాంఛ్ అయింది. ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లాంటిది. ఇందులో యూజర్ల ఆసక్తికి తగ్గ స్టోరీస్ కనిపిస్తాయి.
First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
Google: ఇక పాస్వర్డ్ అవసరం లేదు... లాగిన్ కోసం ఫింగర్ ప్రింట్ చాలుFree ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్
Published by:
Santhosh Kumar S
First published:
August 16, 2019, 12:35 PM IST