Home /News /technology /

Flipkart: కొన్న స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ప్రోగ్రామ్

Flipkart: కొన్న స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ప్రోగ్రామ్

Flipkart: కొన్న స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ప్రోగ్రామ్
(image: Flipkart)

Flipkart: కొన్న స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ప్రోగ్రామ్ (image: Flipkart)

Flipkart Love it or Return it | ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్ కొనాలనుకునేవారి కోసం ఫ్లిప్‌కార్ట్ 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

    స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత అందులో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటేనే రిటర్న్స్ చేస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్లకు కొన్ని రోజుల వరకే రీప్లేస్‌మెంట్ (Smartphone Replacement) పాలసీ ఉంటుంది కాబట్టి అందలోపు రీప్లేస్ చేసుకోవచ్చు. రిటర్న్ పాలసీ ఉండదు. కేవలం రీప్లేస్‌మెంట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఏ మోడల్ కొంటే ఆ మోడల్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కొత్త ప్రోగ్రామ్ ప్రకటించింది. 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' (Love it or return it) పేరుతో కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. హైదరాబాద్, బెంగళూరు, డిల్లీతో పాటు మరిన్ని నగరాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇటీవల ఇండియాలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రోగ్రామ్ ప్రారంభించడం విశేషం.

    Vivo Diwali Offer: కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ రేపటివరకే

    ఫ్లిప్‌కార్ట్ 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ప్రోగ్రామ్‌లో భాగంగా యూజర్లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కొనొచ్చు. 15 రోజులు వాడుకోవచ్చు. 15 రోజుల్లో స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుంచి పూర్తిగా రీఫండ్ ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అమ్మేందుకు సాంసంగ్‌తో ఒప్పందం చేసుకుంది ఫ్లిప్‌కార్ట్. సాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు అయిన సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3,సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మోడల్స్ కొనొచ్చు. 15 రోజుల పాటు ఉపయోగించొచ్చు. మీకు 15 రోజుల్లో స్మార్ట్‌ఫోన్ నచ్చకపోతే రిటర్న్స్ చేయొచ్చు.

    Electricity Bills: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? కరెంట్ బిల్ సులువుగా చెల్లించండి ఇలా


    స్మార్ట్‌ఫోన్ రిటర్న్ చేసేప్పుడు పూర్తిగా చెక్ చేస్తారు. స్మార్ట్‌ఫోన్ కండీషన్‌లో ఎలాంటి మార్పులు లేకపోతే ఫుల్ రీఫండ్ వస్తుంది. రీఫండ్ డబ్బులు నేరుగా కస్టమర్ అకౌంట్‌లో జమ అవుతాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ప్రోగ్రామ్ హైదరాబాద్, బెంగళూరు, పూణె, ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, వడోదరాలో ప్రారంభమైంది. ఇటీవల కాలంలో దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది.

    ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఆ మొబైల్ ఎలా ఉంటుందో అన్న భయం యూజర్లలో ఉండటం మామూలే. కొన్న తర్వాత స్మార్ట్‌ఫోన్ రిటర్న్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రీమియం కొనడానికి వెనకాడుతుంటారు. అందుకే ఫ్లిప్‌కార్ట్ 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్' ప్రోగ్రామ్ ప్రారంభించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Mobile News, Mobiles, Samsung, Samsung Galaxy, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు