Flipkart: విద్యార్థులకు గుడ్ న్యూస్... 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' ఉచితం

Flipkart Plus | అమెజాన్ ప్రైమ్, పేటీఎం ఫస్ట్ లాంటి లాయల్టీ ప్రోగ్రామ్ లాంటిదే ఫ్లిప్‌కార్ట్ ప్లస్. ఈ మెంబర్‌షిప్ తీసుకున్న సభ్యులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి.

news18-telugu
Updated: December 2, 2019, 2:33 PM IST
Flipkart: విద్యార్థులకు గుడ్ న్యూస్... 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' ఉచితం
Flipkart: విద్యార్థులకు గుడ్ న్యూస్... 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ నుంచి గుడ్ న్యూస్. విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తోంది. వయస్సుతో సంబంధం లేదు. విద్యార్థి అయితే చాలు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం మీ దగ్గర స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్లిప్‌కార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సెక్షన్‌లో మెంబర్‌షిప్ ఉచితంగా తీసుకోవచ్చు. ఇందుకోసం వ్యక్తిగత వివరాలు వెల్లడించడంతో పాటు కాలేజీ ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ మీ ఇమెయిల్‌, ఎస్ఎంఎస్‌కు వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్ నడుస్తోంది. డిసెంబర్ 5 వరకు ఈ సేల్ ఉంటుంది. అంతలోపు 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' మెంబర్‌షిప్ ఉచితంగా తీసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్, పేటీఎం ఫస్ట్ లాంటి లాయల్టీ ప్రోగ్రామ్ లాంటిదే ఫ్లిప్‌కార్ట్ ప్లస్. ఈ మెంబర్‌షిప్ తీసుకున్న సభ్యులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. రూ.100 కొనుగోలు చేస్తే 4 సూపర్ కాయిన్స్ లభిస్తాయి. సూపర్ కాయిన్స్ గెలుచుకోవడం, ఉచితంగా, వేగంగా ప్రొడక్ట్స్ డెలివరీ, సేల్స్ సమయంలో ముందే యాక్సెల్ లభించడం, కాయిన్స్ ఎక్స్‌ఛేంజ్ చేసి రివార్డ్స్ పొందడం, ప్రత్యేకమైన కస్టమర్ సపోర్ట్ లాంటి లాభాలు 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' సభ్యులకు ఉంటాయి.

Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్‌2 ప్రో... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

SBI Card: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు మార్చలేదా? డిసెంబర్ 31 డెడ్‌లైన్

Mi Credit: అప్పు కావాలా? షావోమీ ఇస్తుంది... డిసెంబర్ 3న 'ఎంఐ క్రెడిట్' లాంఛ్
Loading...
WhatsApp Fingerprint: మీ వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ కోసం సెట్టింగ్స్ మార్చండిలా
First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...