హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ తాజా బిగ్‌ బిలియన్ డేస్ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫెస్టివల్ ఆఫర్ల (Festival Offers)తో కస్టమర్లను ముంచెత్తుతున్నాయి ఈ-కామర్స్ సంస్థలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkat Big Billion Days Sale) పేరుతో నిర్వహిస్తున్న యాన్యువల్ సేల్స్.. ఈరోజు నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తాజా బిగ్‌ బిలియన్ డేస్ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం.

* ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై బెస్ట్ డీల్స్

- నథింగ్ ఫోన్ (1)ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ.31,999కే కొనుగోలు చేయవచ్చు.

- శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ డివైజ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ. 31,999కి తగ్గింది.

- శామ్‌సంగ్ గెలాక్సీ S22+ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంది.

- గెలాక్సీ S22+ 2022 వేరియంట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ధర ఆట్ లైమ్ లో గా ఉంది. గెలాక్సీ S22+ మోడల్‌ను మినహాయిస్తే.. మిగతా అన్ని వేరియంట్ల ధరలు తగ్గాయి.

- తాజా సేల్‌లో ఐఫోన్ 13 ధర కూడా భారీగా తగ్గింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీని ధర కేవలం రూ. 54,990 నుంచే ప్రారంభమవుతుంది.

- గూగుల్ పిక్సెల్ 6a మోడల్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీన్ని కేవలం రూ. 34,199కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో దీని కొనుగోలుపై కస్టమర్లు రూ. 3,500 తగ్గింపును పొందవచ్చు.

* రియల్‌మీ బ్రాండ్ ఆఫర్లు

- ఈ సేల్‌లో రియల్‌మీ 9, రియల్‌మీ 9i రెండూ వరుసగా రూ. 12,999, రూ. 10,999 ధరలకు లభిస్తున్నాయి.

- రియల్‌మీ 9 Pro+ రూ.21,528కే అందుబాటులో ఉంది.

- రియల్‌మీ 9 5G స్పీడ్ ఎడిషన్‌ను కేవలం రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు.

- రియల్‌మీGT 2పై రూ. 4,000 వరకు, రియల్‌మీ GT 2 ప్రోపై రూ. 13,500 వరకు డిస్కౌంట్ ఉంది.

- రియల్‌మీ 9i 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,999కే లభిస్తుంది.

* పోకో ఫోన్లపై బంపర్ ఆఫర్లు

- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Poco C31 ఫోన్ రూ. 5,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది

- పోకో M4 Pro రూ. 9,749; పోకో X4 ప్రో 5G రూ. 13,999 ప్రారంభ ధరలో లభిస్తున్నాయి.

- Poco M4 Pro 5G, Poco M5 ధరలు వరుసగా రూ. 10,999, రూ. 10,499గా ఉన్నాయి.

- Poco M4 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,749 ధరతో లభిస్తుంది.

- బ్యాంక్ ఆఫర్లతో కలిపి Poco F4 5G రూ. 23,499కే అందుబాటులో ఉంది.

* వివో ఫోన్లపై

- వివో T1 Pro 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 17,999కే అందుబాటులో ఉంది.

- Vivo V25 Pro 5Gని రూ. 32,999కే కొనుగోలు చేయవచ్చు.

- వివో T1 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,999 ధరకే అందుబాటులో ఉంది.

- వివో X80, వివో X80 Proపై వరుసగా రూ. 3,500, రూ. 4,000 డిస్కౌంట్ పొందవచ్చు.

* మోటొరోలా బ్రాండ్..

- మోటో G82 మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 18,499కి కొనుగోలు చేయవచ్చు.

- మోటో G52, మోటో G62 5G ఫోన్ల ధరలు వరుసగా రూ. 12,599, రూ. 14,499 నుంచి ప్రారంభమవుతున్నాయి.

- మోటొరోలా ఎడ్జ్ 30 ఫోన్ రూ. 22,749 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

- మోటో G32, మోటో G42 ధరలు వరుసగా రూ. 9,899, రూ. 11,699కు తగ్గాయి.

* షియోమి, రెడ్‌మీ ఆఫర్లు..

- బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రెడ్‌మీ నోట్ 10T 5G ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 11,699కే లభిస్తుంది.

- షియోమి 11i 5G రూ. 26,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లతో రూ. 4,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

- షియోమి 11i హైపర్‌ఛార్జ్ రూ. 24,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీనిపై రూ. 3,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

* ఒప్పో ఫోన్లపై

- ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో ఒప్పో F19s, F19 Pro+ 5G ఫోన్ల ధరలు వరుసగా రూ. 12,990, రూ. 15,990కి తగ్గాయి.

- తాజా సేల్‌లో ఒప్పో K10 ఫోన్ ధర రూ. 11,990కు తగ్గింది.

- ఒప్పో రెనో 7 ప్రో 5G, రెనో 8 5G ఫోన్లను వరుసగా రూ. 33,999, రూ. 26,999కి కొనుగోలు చేయవచ్చు.

* శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లపై..

- ఫెస్టివల్ ఆఫర్లలో శామ్‌సంగ్ బడ్జెట్ డివైజ్‌లు అయిన గెలాక్సీ F13 రూ. 8,499కి, గెలాక్సీ F23 5G రూ. 10,999కే లభిస్తున్నాయి.

* ఇన్ఫినిక్స్ డిస్కౌంట్లు

- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G ధర రూ. 12,599కి తగ్గింది.

- ఇన్ఫినిక్స్ నోట్ 12, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఫోన్ల ధరలు వరుసగా రూ. 8,999, రూ. 10,799 నుంచి ప్రారంభమవుతున్నాయి.

- ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో, ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే, స్మార్ట్ 6, స్మార్ట్ 6 హెచ్‌డీ మోడళ్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Smart phones, Tech news

ఉత్తమ కథలు