Home /News /technology /

Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్
(ప్రతీకాత్మక చిత్రం)

Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Offer | ఫ్లిప్‌కార్ట్ మీకు అద్భుతమైన ఆఫర్ (Flipkart Offer) అందిస్తోంది. డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ (Online Shopping) చేసే అవకాశం కల్పిస్తోంది.

    దసరా, దీపావళి సందర్భంగా ఇంట్లోకి టీవీ, ఫ్రిజ్ తీసుకోవాలనుకుంటున్నారా? కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' (Flipkart Pay Later) ఆఫర్‌లో భాగంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించొచ్చు. 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' (Flipkart Pay Later) ఆఫర్ కొత్తదేమీ కాదు. గతంలో ఉన్నదే. కానీ గతంలో క్రెడిట్ లిమిట్ (Credit Limit) కేవలం రూ.10,000 మాత్రమే ఉండేది. అంటే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు పే లేటర్ ఆప్షన్ ద్వారా గరిష్టంగా రూ.10,000 మాత్రమే క్రెడిట్ పొందే అవకాశం ఉండేది.

    ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మొదలైంది. త్వరలో దసరా సేల్, దీపావళి సేల్ జరగనున్నాయి. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్  (Flipkart Big Billion Days Sale) నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అక్టోబర్ మొదటివారంలోనే ఈ సేల్ ఉండే అవకాశం ఉంది. ఈ సేల్‌ను దృష్టిలో పెట్టుకొని అంతకన్నా ముందే 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' ఆఫర్‌లో క్రెడిట్ లిమిట్‌ను భారీగా పెంచింది ఫ్లిప్‌కార్ట్.

    Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

    కరోనా వైరస్ సంక్షోభంతో అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో షాపింగ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు చెల్లించకుండా షాపింగ్ చేసి ఈఎంఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అందుకే క్రెడిట్ లిమిట్‌ను ఏకంగా రూ.10,000 నుంచి రూ.70,000 చేసింది. ఈ మొత్తంతో కస్టమర్లు స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ కొనేయొచ్చు.

    ఫ్లిప్‌కార్ట్‌లోని 10 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లభిస్తోంది. వారంతా పే లేటర్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువు కొనొచ్చు. పే లేటర్ ఆప్షన్ ద్వారా క్రెడిట్ లిమిట్ పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాలి. ఆ తర్వాతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ అవుతుంది.

    Realme Pad: రియల్‌మీ ట్యాబ్లెట్ తొలి సేల్ ఈరోజే... రూ.1,000 డిస్కౌంట్

    ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్ కార్ట్‌లో యాడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ సెక్షన్‌లో పే Flipkart Pay Later EMI ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత టెన్యూర్ సెలెక్ట్ చేయాలి. ఎంత ఈఎంఐ చెల్లించాలో అక్కడ వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రతీ నెలా ఈఎంఐ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

    ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ మాత్రమే కాదు... అనేక కంపెనీలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, హోమ్ క్రెడిట్, హెచ్ఎస్‌బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాంటి అనేక బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ అందిస్తున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Credit cards, Flipkart, Flipkart Big Billion Days

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు