హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Updates: ఫ్లిప్‌కార్ట్‌ వినియోదారులకు గుడ్ న్యూస్.. యాప్ లో అందుబాటులోకి రెండు కొత్త ఫీచర్స్..

Flipkart Updates: ఫ్లిప్‌కార్ట్‌ వినియోదారులకు గుడ్ న్యూస్.. యాప్ లో అందుబాటులోకి రెండు కొత్త ఫీచర్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వినియోదారులను ప్రతి విషయంలో ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ప్రధాన నగరాలకే కాకుండా పట్టణ, గ్రామీణ ప్రజలకు ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టెక్నాలజీ(Technology) నిత్యావసరంగా మారిపోయింది. కూరగాయల దుకాణం నుంచి బంగారం కొట్టు దాకా అన్నింట్లోనూ టెక్నాలజీ అడుగుపెట్టింది. ఆన్ లైన్ షాపింగ్(Online Shopping), డిజిటల్ ట్రాన్సాక్షన్‌లతో(Digital Transactions) పాటు నిత్యావసరాల మార్కెట్లోనూ దూసుకుపోతోంది. ఈ -కామర్స్(E Commerce) దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) వినియోదారులను ప్రతి విషయంలో ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ప్రధాన నగరాలకే కాకుండా పట్టణ, గ్రామీణ ప్రజలకు ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన వినియోగదారుల సేవలను మరింత సులభతరం గా చేసేందుకు యాప్ లో మార్పులు చేర్పులు చేయనుంది.

హోమ్‌ పేజీ నావిగేషన్‌ సులువు..

ఫ్లిప్‌కార్ట్‌ పట్టణ, గ్రామీణ ప్రజల వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. హోమ్ పేజీ నావిగేషన్ అనుభవాన్ని సులభతరం చేయడానికి యాప్‌ను రీడిజైన్ చేసింది. కిరాణా షాపింగ్ కోసం ప్రత్యేక విభాగాన్ని యాప్‌లో యాడ్‌ చేసింది. ఈ రెండు ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు అందించనుంది. కస్టమర్లకు ఈ కొత్త డిజైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వాల్ మార్ట్ యాజమాన్యంలోని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ లో ఇప్పటికే ఇది అందుబాటులో ఉంది. వచ్చే నెలలో ఐఓఎస్ లో ఈ ఫీచర్‌ విడుదల కానుంది.

యాప్‌లో షాపింగ్, కార్ట్, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు స్క్రీన్ దిగువున ఉంటాయి. దీంతో వినియోదారులు యాప్ వినియోగించడం సులువుగా ఉంటుంది. యాప్ రీడిజైన్ పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రోడక్ట్ హెడ్ భరత్ రామ్ వివరణ ఇచ్చారు. బొటనవేలికి చాలా దగ్గరగా ఆప్షన్‌లు ఉండటంతో వినియోగదారులు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Samsung Mobile: మొబైల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ ఫోన్‌ల అమ్మకాలను నిలిపేస్తున్న శాంసంగ్..


ఇక కిరాణా షాపింగ్ కోసం ప్రత్యేకంగా హోమ్ పేజీ ఎగువన ఆప్షన్ యాడ్ చేశారు. ఎక్కువ మంది కస్టమర్లు తెలసుకునేలా, తరుచు ఉపయోగించేలా హోమ్ పేజీ ఎగువున ఆప్షన్‌ ఉంచారు. కిరాణా షాపింగ్ లో ఈ-కామర్స్ దూసుకుపోతోంది. అయితే కిరాణా సామాగ్రికి అగ్రస్థానం ఇస్తూ ఈ ఆప్షన్ ను ఎగువకు మార్చినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రోడక్ట్ హెడ్ భరత్ రామ్ తెలిపారు. కిరాణాకు అగ్రస్థానం ఇచ్చి కస్టమర్ల మనస్సును దోచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు కిరాణా షాపింగ్ ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది. అందుకే దీనిపై మరింత దృష్టి పెట్టామని భరత్ రామ్ పేర్కొన్నారు.

51 శాతం పట్టణ ప్రజలే..

కరోనా మహామ్మారి తర్వాత కిరాణా షాపింగ్ ఈ- కామర్స్ లో ముఖ్యమైన వ్యాపారంగా మారిపోయింది. 30 వేల మంది దుకాణదారులతో సర్వే చేయగా.. ఆన్ లైన్‌లో కిరాణా వస్తువులను కొనుగోలు చేసిన వారిలో 51 శాతం మంది పట్టణాలకు చెందిన ప్రజలే ఉన్నారని తేలింది. ఈ సర్వేలో 30 వేల మంది దుకాణదారులు పాల్గొన్నారు.

నగరాల్లోని వినియోగదారుల కోసం వినియోగదారుల - కేంద్రీకృత ప్రోగ్రామ్‌లతో కేటగిరీల వారీగా ఫ్లిప్‌కార్ట్‌ రీపర్పోజ్ చేస్తోంది. కస్టమర్లు డీల్‌లను సులభంగా కనుగొనడానికి ఇది సహాయపడుతుంది. మొదటి 100 మిలియన్ కస్టమర్లు మెట్రోలు, పెద్ద నగరాల నుంచి రాగా, తర్వాతి 500 మిలియన్ల కస్టమర్లు టైర్ 3 నగరాలు అంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు నుంచి వస్తారని రామ్ అభిప్రాయపడ్డారు.

First published:

Tags: 5g technology, Flipkart, Technology

ఉత్తమ కథలు