హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఎలక్ట్రానిక్ వస్తువులపై బోలెడు డిస్కౌంట్లు.. ప్రారంభమైన ఫ్లిప్‌స్టార్ట్ సేల్..

Flipkart: ఎలక్ట్రానిక్ వస్తువులపై బోలెడు డిస్కౌంట్లు.. ప్రారంభమైన ఫ్లిప్‌స్టార్ట్ సేల్..

Flipkart Sale: అర్థరాత్రి 12 గంటల నుంచి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే...
(image: Flipkart)

Flipkart Sale: అర్థరాత్రి 12 గంటల నుంచి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే... (image: Flipkart)

Flipkart Flipstart Sale: సోనీ, జేబీఎల్‌ వంటి హెడ్‌సెట్లు, స్పీకర్లపై 70 శాతం వరకు రాయితీ లభిస్తుంది. హెచ్‌పీ, ఏసర్‌ తదితర ల్యాప్‌టాప్‌ల ధర రూ.13వేల నుంచి ప్రారంభం కానుంది.

    ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ రోజు నుంచి మరో కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ పేరుతో నేటి నుంచి జూన్ 3వరకు భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులపైనే డిస్కౌంట్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. హెడ్‌సెట్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, పవర్‌ బ్యాంక్‌లు, మొబైల్‌ కేస్‌లు తదితర వస్తువులపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక, సోనీ, జేబీఎల్‌ వంటి హెడ్‌సెట్లు, స్పీకర్లపై 70 శాతం వరకు రాయితీ లభిస్తుంది. హెచ్‌పీ, ఏసర్‌ తదితర ల్యాప్‌టాప్‌ల ధర రూ.13వేల నుంచి ప్రారంభం కానుంది. పవర్‌ బ్యాంకులు, మొబైల్‌ కేస్‌లు, ఇతర మొబైల్‌ ఉపకరణాల ప్రారంభ ధర మినిమమ్‌ రూ.99 నుంచి ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, నో కాస్ట్‌ ఈఎంఐ, వారంటీ పొడిగింపు, ఎక్స్‌ఛేంజ్‌ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.


    32 అంగుళాల వ్యూ స్మార్ట్ హెచ్‌డీ టీవీ రూ.12,499 ధరకే కొనొచ్చు. సమ్మర్ అప్లయెన్సెస్ అయిన ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంది. హోమ్ అండ్ ఫర్నీచర్ కేటగిరీలో 30 నుంచి 75 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఫ్యాషన్‌పై 40 నుంచి 80 శాతం, బ్యూటీ, బేబీకేర్, టాయ్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి మాత్రమే కాదు ఆన్‌లైన్‌లో గ్రాసరీస్ కొనేవారికి ఒక్క రూపాయికే కొన్ని వస్తువుల్ని అమ్మనుంది ఫ్లిప్‌‌కార్ట్. ఎంపిక చేసిన ఉత్పత్తులపై అదనంగా 15 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.1,499 బిల్లింగ్ చేసినవారికి 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది. ఇక, యాక్సిస్ బ్యాంకు కార్డులతో చెల్లింపులు చేస్తే ఇన్‌స్టంట్ 10 శాతం డిస్కౌంట్ అందజేస్తామని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.


    First published:

    Tags: Android, Flipkart, Online shopping, Smartphone

    ఉత్తమ కథలు