Home /News /technology /

FLIPKART END OF SEASON SALE BUY INFINIX HOT 12 PLAY SMARTPHONE FOR RS 7 THOUSAND ONLY HERE DETAILS NS

Flipkart EOSS Offers: ఫ్లిప్ కార్ట్ లో సీజన్ ఎండ్ సేల్.. ఈ 6000mAh స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.7 వేలకే.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్ కార్ట్ లో End Of Season Sale (EOSS) ప్రారంభమైంది. ఈ సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందుకోవచ్చు.

    ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో End Of Season Sale (EOSS) ప్రారంభమైంది. ఈ సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై (Smartphone) భారీ డిస్కౌంట్లను అందుకోవచ్చు. కస్టమర్‌లు ఈ సేల్ లో 'బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది ఇయర్'ని పొందే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సెల్ లో బడ్జెట్ ఫోన్లు, మిడ్ రేంజ్ ఫోన్లు, ప్రీమియం ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లోని కొన్ని అత్యుత్తమ ఆఫర్‌ల గురించి మాట్లాడితే.. కస్టమర్‌లు ఇక్కడ నుండి తక్కువ ధరకు Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఫోన్‌ను రూ.11,999కి బదులుగా కేవలం రూ.7,749కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన స్పెసిఫికేషన్ ఏంటంటే.. దాని 6000mAh బ్యాటరీ.

    Infinix Hot 12 Play 6.82-అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఎల్సీడీ ప్యానెల్‌తో వస్తుంది. మరియు దీని రిజల్యూషన్ 1612×720 పిక్సెల్‌లు. విశేషమేమిటంటే బడ్జెట్ఫోన్ అయినప్పటికీ.. ఫోన్ రిఫ్రెష్ రేట్ 90Hz మరియు టచ్ శాంప్లింగ్ రేట్ 180Hzగా ఉంది.
    UPI Payment: మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేస్తుంటారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

    ఈ ఫోన్ Unisoc T610 SoCతో వస్తుంది. ఈ పరికరం XOS 10 ఆధారంగా Android 11లో పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. ఇది 4GB + 64GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్‌ను కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించవచ్చు.
    Amazon Shoes Trial: అమెజాన్‌లో అద్భుతమైన ఫీచర్.. వర్చువల్‌గా షూస్‌ ట్రయల్ చేసుకునే ఛాన్స్.. ఇదిగో వీడియో

    6000mAh భారీ బ్యాటరీ..
    పవర్ కోసం, ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఇవ్వబడుతుంది, ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో 4G, సింగిల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, GNSS మరియు USB టైప్-సీ ఛార్జర్ ఉంది. ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ మరియు వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు AI లెన్స్ అందుబాటులో ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Infinix, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు