హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ సోనీ స్మార్ట్‌టీవీపై రూ.20 వేలకు పైగా భారీ డిస్కౌంట్.. ఇలా కొనేయండి

Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ సోనీ స్మార్ట్‌టీవీపై రూ.20 వేలకు పైగా భారీ డిస్కౌంట్.. ఇలా కొనేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో (Flipkart) స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్ (Flipkart Electronics Sale) ను నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సేల్.. 10వ తేదీ అంటే రేపటి వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా స్మార్ట్ టీవీ (Smart Tv) కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ సువర్ణావకాశం. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. Mi, Realme, One Plus, Sony తదితర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం తగ్గింపు (Bank Discounts) సైతం లభిస్తుంది. మీరు కూడా మీ పాత టీవీ స్థానంలో కొత్త స్మార్ట్ టీవీని కొనాలని భావిస్తే ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. SONY W820 80 cm (32 inch) HD Ready LED Smart Android TV పై భారీగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

వాస్తవానికి ఈ టీవీ ధర రూ.34,900 కాగా.. ఈ టీవీపై 31 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో ఎవరైనా ఈ టీవీని 10,901 తగ్గింపుతో రూ.23,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ టీవీపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సోనీ స్మార్ట్ టీవీని సిటీ బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా మీ పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.13,150 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

Chromecast With TV: గూగుల్ కొత్త టీవీ.. సూపర్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా..?

' isDesktop="true" id="1363114" youtubeid="VlMtpieF1bg" category="technology">

మీ పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. రూ.10,849 కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఓఎస్ పై నడిచే ఈ టీవీ Netflix| Prime Video| Disney+Hotstar| Youtube తదితర అన్ని వీడియో స్ట్రీమింగ్ యాప్ లను సపోర్ట్ చేస్తుంది.

First published:

Tags: Budget smart tv, Flipkart, Latest offers, Smart TV, Sony TV

ఉత్తమ కథలు