హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌.. ఈ 5G స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌.. ఈ 5G స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌’ను లైవ్‌లోకి తీసుకొచ్చింది. ఐదు రోజులపాటు జరిగే ఈ మెగా సేల్ ఈవెంట్‌లో వివిధ కంపెనీల 5G స్మార్ట్‌ఫోన్స్‌పై బంపరాఫర్స్ ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Flipkart: దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) కస్టమర్లను ఆకర్షించడానికి సీజన్‌కు తగ్గట్టు కొత్త సేల్ ఈవెంట్‌లతో ముందుకు వస్తూ సేల్స్ పెంచుకుంటోంది. తాజాగా ‘ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌’(Electronics sale event)ను లైవ్‌లోకి తీసుకొచ్చింది. ఐదు రోజులపాటు జరిగే ఈ మెగా సేల్ ఈవెంట్‌లో వివిధ కంపెనీల 5G స్మార్ట్‌ఫోన్స్‌పై బంపరాఫర్స్(Offers on 5G Smartphone) ప్రకటించింది. ప్రధానంగా పోకో X5 ప్రో, ఐఫోన్ 13, వివో V27,శామ్‌సంగ్ గెలాక్సీ S23 వంటి మోడల్స్‌పై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* శామ్‌సంగ్ గెలాక్సీ S23

ఈ 5G స్మార్ట్‌ఫోన్ గత నెల ఫిబ్రవరిలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భారీ బ్యాంక్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం గెలాక్సీ S23 మోడల్ రూ.79,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫైనల్‌గా రూ.74,999కు సొంతం చేసుకోవచ్చు.

* వివో V27

బెస్ట్ ఫీచర్స్ ఉన్న వివో V27 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.32,999కు లిస్ట్ అయింది. అయితే తాజా ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌లో దీనిపై బ్యాంక్ ఆఫర్‌ను ప్రకటించింది. హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై దీన్ని కొనుగోలు చేస్తే రూ.2500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.30,499కు సొంతం చేసకోవచ్చు. వివో V27 128GB స్టోరేజ్ మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ ఈ బ్యాంక్ ఆఫర్‌ను ప్రకటించింది.

* రెడ్‌మీ నోట్ 12 ప్రో

రెడ్‌మీ కంపెనీకి చెందిన ఈ 5G మిండ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం లైవ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ.24,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో రెడ్‌మీ నోట్ 12 ప్రో‌ను రూ.22,999 డిస్కౌంట్ ధరతో ఫైన‌ల్‌గా కొనుగోలు చేయవచ్చు.

గదిలో ఏ సైజ్ ఫ్యాన్ అమర్చాలి? పెద్ద లేదా చిన్న ఫ్యాన్‌ పెట్టడం గాలిని ప్రభావితం చేస్తుందా?

* ఐఫోన్ 13

ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్13పై మంచి డీల్‌ను అందిస్తోంది. ఈ మోడల్‌కు చెందిన 128GB స్టోరేజ్ వేరియంట్‌‌ను రూ.61,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంచింది. హెచ్‌డీ‌ఎఫ్ సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో దీని ధర రూ. 59,999కు తగ్గుతుంది. ఇది భారీ ధర అయినప్పటికీ యాపిల్ విక్రయిస్తున్న ధరతో పోల్చుకుంటే తక్కువకే లభిస్తుంది. Apple అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 13 ప్రస్తుతం రూ.69,900 ధరతో అందుబాటులో ఉండటం గమనార్హం.

* ఇతర ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ ఇతర ఫోన్లపై కూడా బెస్ట్ డీల్స్ అందిస్తోంది. వాటిలో నథింగ్ ఫోన్(1), పిక్సెల్6a వంటివి ఉన్నాయి. నథింగ్ ఫోన్(1) ధర రూ. 32,999 కాగా, ఎలక్ట్రానిక్స్ సేల్‌లో రూ.29,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంచింది. ఇక Pixel 6a ప్రారంభ ధర రూ. 31,999 కాగా, HDFC బ్యాంక్ కార్డ్‌లపై కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్‌గా రూ.29,999కు సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: Flipkart, Iphone 13, Samsung Galaxy, Smart phone

ఉత్తమ కథలు