Home /News /technology /

FLIPKART ELECTRONICS SALE 2022 START ALL MOBILE PHONES ARE DISCOUNTED UMG GH

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ ప్రారంభం.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. బెస్ట్ డీల్స్ ఇవే..!

ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లో స్మార్ట్ ఫోన్లు.

ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లో స్మార్ట్ ఫోన్లు.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్‌తో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్ సేల్‌-2022ను కంపెనీ లాంచ్ (Launch) చేసింది. తాజా ఆఫర్లలో తక్కువ ధరకు లభిస్తున్న ఐదు సార్ట్‌ఫోన్లు (SmartPhone) ఏవో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్ సేల్‌-2022ను కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు, జూన్ 26 వరకు కొనసాగుతాయి. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అనేక ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో టాప్ బ్రాండ్‌ల నుంచి బెస్ట్ మోడళ్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. తాజా ఆఫర్లలో తక్కువ ధరకు లభిస్తున్న ఐదు సార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

iPhone 13
యాపిల్ ఐఫోన్ 13ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 73,999కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 79,900 కాగా, తాజా సేల్‌లో కస్టమర్లు రూ.5,901 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ EMI ట్రాన్సాక్షన్స్‌పై రూ. 4,000 అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఐఫోన్ 13 ధర రూ.69,999కు తగ్గుతుంది.

Realme Narzo 50
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ. 12,999కే కొనుగోలు చేయవచ్చు. హ్యాండ్‌సెట్ అసలు ధర రూ. 15,999గా (4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్) ఉంది. దీనిపై తాజా సేల్‌లో రూ.3000 డిస్కౌంట్ పొందవచ్చు. బడ్జెట్ 5G ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పుకోవచ్చు.

ఇదీ చదవండి:  శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


Xiaomi 11i 5G
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డివైజ్‌పై భారీ ఆఫర్ ఉంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999 వద్ద అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్‌పై రూ. 4,000 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అంటే షియోమి 11i ధర రూ. 20,999కు తగ్గుతుంది. SBI క్రెడిట్ కార్డ్‌పై మరో 10 శాతం (రూ. 1,000 వరకు) తగ్గింపు ఉంది. వీటన్నింటినీ కలుపుకుంటే షియోమి 11i 5G ఫోన్‌ను రూ. 19,999 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy F22
శామ్‌సంగ్ నుంచి రిలీజ్ అయిన ఈ బడ్జెట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ. 11,499కే విక్రయిస్తోంది. ఈ డివైజ్‌పై కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. గెలాక్సీ F22 ఫోన్ 90Hz AMOLED స్క్రీన్, 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో G80 చిప్‌సెట్ వంటి ఫీచర్లతో వస్తుంది.



Redmi Note 10S
ఇండియాలో రూ.14,999 ప్రారంభ ధరతో విడుదలైన రెడ్‌మి నోట్ 10ఎస్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999 ధరతో అందుబాటులో ఉంది. అంటే రూ.2,000 డిస్కౌంట్ ఇస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 డిస్కౌంట్, డెబిట్ కార్డ్‌పై రూ. 1,000 డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్లతో రెడ్‌మీ నోట్ 10S 4G ఫోన్‌ను రూ. 12,000 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Flipkart, Mobiles, Smart phone, Tech news

తదుపరి వార్తలు