Home /News /technology /

FLIPKART ELECTRONICS SALE 2022 BUY MARQ M3 SMART PHONE FOR RS 6 THOUSAND ONLY HERE OFFER DETAILS NS

flipkart Electronics Sale 2022: తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. రూ.6 వేలకే 5000 mAh భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్.. ఆఫర్ వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే.. ఈ 5000 mAh భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6999కే కొనేయండిలా..

    ఈ రోజు అంటే మే 29 ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఎలక్ట్రానిక్ సేల్ కు ఆఖరి తేదీ. మీరు తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అనేక బ్రాండ్‌లపై భారీగా తగ్గింపులు ఉన్నాయి. ఇంకా బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సేల మే 24న ప్రారంభమైంది. ఈ సేల్ లో షాపింగ్ చేస్తే కోటక్, RBL బ్యాంక్ వినియోగదారులకు 10% తక్షణ తగ్గింపు కూడా లభించనుంది. మీరు మంచి బ్యాటరీ కలిగిన ఫోన్ ను ఈ సేల్ లో తక్కువ ధరకు సొంతం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ మీకు బెస్ట్ ఆప్షన్. 5000mAh బ్యాటరీ కలిగిన MarQ M3 స్మార్ట్‌ను రూ. 7,999కి బదులుగా రూ. 5,999కే ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

    MarQ M3 స్మార్ట్ 720×1560 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.088-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్లో 2 GB RAM తో పాటు 32 GB స్టోరేజ్ ఉంటుంది. మెమరీ కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టోరేజ్ ను 256 GB వరకు విస్తరించవచ్చు.
    Flipkart Updates: ఫ్లిప్‌కార్ట్‌ వినియోదారులకు గుడ్ న్యూస్.. యాప్ లో అందుబాటులోకి రెండు కొత్త ఫీచర్స్..

    కెమెరా వివరాలు:
    ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే.. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌. రెండవ లెన్స్ డిజిటల్, దీని గురించి కంపెనీ మెగాపిక్సెల్‌ ఎంత అనే సమాచారం ఇవ్వలేదు. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్, టైమ్‌లాప్స్ తదితర ఫీచర్లను కెమెరాతో అందించారు.

    కనెక్టివిటీ కోసం, 3.5mm ఆడియో జాక్, మైక్రో USB, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS, 4G వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. పవర్ కోసం, ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 24 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఉంటుంది. ఫేస్ అన్‌లాక్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Flipkart, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు