Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్‌... టీవీలపై భారీ డిస్కౌంట్స్‌

Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్‌... టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Electronics Sale | మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. స్మార్ట్ టీవీలపై ఉన్న ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్‌ సేల్‌ను ప్రారంభించింది. వివిధ బ్రాండ్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై పది శాతం డిస్కౌంట్‌ అదనంగా ఉంది. ఇది కాకుండా సేల్‌లో భాగంగా టీవీ కంపెనీలు భారీ డిస్కౌంట్‌లు కూడా ప్రకటించాయి. అవేంటి, ఏ టీవీ ఎంత తగ్గుతోంది లాంటి వివరాలు మీ కోసం!

రియల్‌మీ 32 ఇంచ్‌ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీపై ₹2000 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీ ₹15,999కే అమ్మబోతున్నారు. గతంలో దీని ధర ₹17,999.

సాంసంగ్‌కు చెందిన 32 ఇంచ్‌ హెచ్‌డీ రెడీ స్మార్ట్‌ టీవీ ధర ₹19,990. అయితే దీనిని ₹17,499కే ఇస్తున్నారు. అంటే ఈ టీవీపై సుమారు ₹2500 తగ్గుతోంది.

WhatsApp: వాట్సప్ నోటిఫికేషన్ చిక్కులకు ఇక చెక్... ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

Swiggy: స్విగ్గీకి షాక్... రూ.4.50 జీఎస్‌టీ వసూలు చేసినందుకు రూ.20,000 ఫైన్

ఎల్‌జీ నుంచి వచ్చిన 43 అంగుళాల ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 2020పై తగ్గింపు ప్రకటించారు. ₹40,990 ఉన్న టీవీని ₹9000 తగ్గించి ₹31,990కి ఇస్తున్నారు.

వీయూ ప్రీమియం వెర్షన్‌ 50 ఇంచ్‌ టీవీని ₹36,999కే ఇస్తున్నారు. దీని ఒరిజినల్‌ ధర ₹60 వేలు. అంటే సుమారు ₹24 వేలు తగ్గుతోంది.

వన్‌ప్లస్‌ యూ సిరీస్‌లో ₹49,999 ధరతో యూ1ఎస్‌ టీవీ వచ్చింది. ఇప్పుడు ఆ టీవీకి రూ.మూడు వేలు తగ్గించి ఈ సేల్‌లో ₹46,999కే ఇస్తున్నారు.

మోటోరోలా నుండి రెవో పేరుతో 55 ఇంచ్‌ల 4కె ఎల్‌ఈడీ టీవీ ఒకటి ఉంది. దాని ఒరిజినల్‌ ధర 49,999 కాగా, ప్రస్తుతం రూ.ఐదు వేలు తగ్గించి ₹44,999కి ఇస్తున్నారు.

Zomato: జొమాటో వాడుతున్నారా? రూ.3,00,000 రివార్డు గెలుచుకోవచ్చు ఇలా

Realme 5G Smartphone: రియల్‌మీ సంచలనం... రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్

55 అంగుళాల హైసెన్స్‌ టీవీపై ₹12 వేలు ధర తగ్గించి ₹47,999కి అందిస్తున్నారు. దాని ఒరిజినల్‌ ధర ₹59,990.

ఇఫాల్కన్‌ నుండి 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీపై కూడా ఆఫర్‌ ఉంది. ఈ టీవీని ₹36,999కి ఇస్తున్నారు. దీని ఒరిజినల్‌ ధర ₹1,06,990 అట.

ఎంఐ నుంచి 50 అంగుళాల టీవీ రేంజిలో 4ఎక్స్ ఉంది. ఈ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని ఇప్పుడు ₹34,999కే ఇస్తున్నారు. దీని ఒరిజినల్‌ ధర ₹41,999.

నోకియా బ్రాండ్‌ నుంచి 55 అంగుళాల టీవీ కూడా ఒకటి సేల్‌లో ఉంది. ఈ టీవీని రూ.ఏడు వేలు ధర తగ్గించి అంటే ₹34,999కే ఇస్తున్నారు. దీని ఒరిజినల్‌ ధర ₹41,999.
Published by:Santhosh Kumar S
First published: