హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్ లో అదిరే ఆఫర్లు.. కేవలం రూ.549కే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.. వెంటనే కొనేయండిలా..

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్ లో అదిరే ఆఫర్లు.. కేవలం రూ.549కే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.. వెంటనే కొనేయండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎవరూ ఊహించని రీతిలో కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. వాటిలో రెడ్‌మీ 10 (Redmi 10) ఫోన్‌పై తీసుకొచ్చిన డిస్కౌంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఎలక్ట్రానిక్ వస్తువులు డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చేయాలంటే.. దసరా, దీపావళికి మించిన సేల్స్‌ (Diwali Offers) మరేవీ ఉండవు. మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇదొక మంచి సమయం. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఏటా ఇండియాలో ఆయా కంపెనీలతో పాటు ఈ-కామర్స్ సంస్థలు సైతం మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. కాగా ఈసారి దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎవరూ ఊహించని రీతిలో కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. వాటిలో రెడ్‌మీ 10 (Redmi 10) ఫోన్‌పై తీసుకొచ్చిన డిస్కౌంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రూ.6 వేలకు పైగా డిస్కౌంట్‌

ఫ్లిప్‌కార్ట్ తన ఆన్‌గోయింగ్ బిగ్ దివాలీ సేల్‌ (Flipkart Big Diwali Sale)లో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.6 వేలకు పైగా డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. బడ్జెట్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. కొనుగోలుదారులు ఇతర ఆఫర్లను కూడా ఉపయోగించుకుంటూ దీని ధర చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ ఆఫర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం Redmi 10 కేవలం రూ.8,549కే అందుబాటులోకి రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. వాస్తవానికి రెడ్‌మీ 10 బేస్ 64GB వేరియంట్ రూ.14,999 అసలు ధరతో లాంఛ్‌ అయింది. కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిని జస్ట్ రూ.8,549కే విక్రయిస్తోంది. అంటే రెడ్‌మీ 10పై సుమారు 43 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

32 inch Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.8,999 మాత్రమే... ఆఫర్ వివరాలివే

రూ.549కే ఫోన్‌ దక్కించుకోవచ్చు

అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్లను యూజ్ చేసుకుని రెడ్‌మీ 10 ధరను మరింత తగ్గించవచ్చు. వాటిలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.8,000 వరకు ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రెడ్‌మీ 10 ధరపై 8,000 తగ్గింపు అందుకోవచ్చు. ఈ రెండు ఆఫర్లతో Redmi 10 కేవలం రూ.549 ధరకి దిగి వస్తుంది. మిడ్‌నైట్, బ్లాక్ కరేబియన్ నైట్ అనే రెండు కలర్ ఆప్షన్స్ కూడా ఇదే తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. రెడ్‌మీ 10పై చాలా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఫుల్ స్వైప్‌పై రూ.1,250 తగ్గింపు, EMI ట్రాన్సాక్షన్లపై 1750 తగ్గింపు అందుకోవచ్చు. అంతేకాకుండా, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపును అదనంగా పొందొచ్చు.

రెడ్‌మీ 10 ఫీచర్లు

రెడ్‌మీ 10 ఫోన్ 60 Hz రిఫ్రెష్ రేట్, 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులోని డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్‌ ఆఫర్ చేశారు. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11, 6000mAh బ్యాటరీతో ఈ మొబైల్ లాంఛ్‌ అయింది. రెడ్‌మీ 10 128GB టాప్ వేరియంట్ కూడా రూ.12,499కే సేల్‌కి వచ్చింది. ఈ టాప్ వేరియంట్‌పై కంపెనీ దాదాపు 26% డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు ఫ్లిప్‌కార్ట్ సైట్ విజిట్ చేయవచ్చు.

First published:

Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Latest offers, Redmi, Smartphone

ఉత్తమ కథలు