హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే
(ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే (ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping | మీరు ఫ్లిప్‌కార్ట్‌లో లేదా అమెజాన్‌లో మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారా? పార్శిల్ రాగానే ఓటీపీ చెప్పి ప్రొడక్ట్ తీసుకుంటున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నట్టే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఢిల్లీకి చెందిన ఐఐఎం గ్రాడ్యుయేట్ యశస్వి శర్మ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఘడీ డిటర్జెంట్ ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌ (LinkedIn) పోస్ట్‌లో వివరించడంతో ఆ పోస్ట్ వైరల్ అయింది. తన తండ్రి కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్ కొన్నానని, కానీ డిజర్జెంట్ బార్స్ వచ్చాయని తెలిపాడు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌కు కంప్లైంట్ చేస్తే మొదట రీఫండ్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఫ్లిప్‌కార్ట్ దిగొచ్చింది. రీఫండ్ ఇస్తానని ఒప్పుకుంది.

ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్

అయితే ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రెండు సంస్థలు మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ లాంటి ఖరీదైన ప్రొడక్ట్స్‌కి ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాయి. ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ గురించి కస్టమర్లకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. మొబైల్ , ల్యాప్‌టాప్ లేదా ఇతర ఖరీదైన వస్తువు ఏది ఆర్డర్ చేసినా దానికి ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ వర్తిస్తుందో లేదో చూడాలి. పేమెంట్ ఆప్షన్ చేయడం కన్నా ముందే దీనికి సంబంధించిన సమాచారం స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒకవేళ ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ ఉన్నట్టైతే డెలివరీ ఏజెంట్ పార్సిల్ తీసుకురాగానే ఓటీపీ చెప్పి పార్శిల్ తీసుకోకూడదు.

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

కస్టమర్లు ఓటీపీ చెప్పడం కన్నా ముందే డెలివరీ ఏజెంట్‌తో పార్శిల్ ఓపెన్ చేయించాలి. ఆ పార్శిల్‌లో మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ ఉందో లేదో చూడాలి. ఆ ప్రొడక్ట్ పనిచేస్తుందో లేదో చెక్ చేయొచ్చు. అన్నీ సరిగ్గా ఉంటేనే ఓటీపీ చెప్పి ప్రొడక్ట్ తీసుకోవాలి. అంతే తప్ప ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ వర్తించే ప్రొడక్ట్స్‌కి కేవలం పార్శిల్ ఓపెన్ చేయించకుండా ఓటీపీ చెప్పి ప్రొడక్ట్ తీసుకోకూడదు.

మీరు డెలివరీ ఏజెంట్‌తో పార్శిల్ ఓపెన్ చేయించకుండా ఓటీపీ చెప్పి, ప్రొడక్ట్ తీసుకున్నారంటే ఇక ఆ పార్శిల్‌లో ఏమి ఉన్నా సదరు ఇ-కామర్స్ సంస్థకు సంబంధం ఉండదు. వేరే ప్రొడక్ట్ వచ్చినా, ఆ ప్రొడక్ట్ పనిచేయకపోయినా తాము బాధ్యత వహించమని ఇ-కామర్స్ సంస్థలు నియమనిబంధనల్లో వెల్లడిస్తున్నాయి.

5G Mobile: 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

అయితే ఢిల్లీకి చెందిన యశస్వి శర్మ విషయంలో ఇదే పొరపాటు జరిగింది. ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్ గురించి అవగాహన లేని అతని తండ్రి కేవలం ఓటీపీ చెప్పి పార్శిల్ తీసుకున్నారు. పార్శిల్ తీసుకోవడానికి ఓటీపీ చెప్పాలేమో అనుకుని ఓటీపీ చెప్పేశారు. పార్శిల్ తీసుకొని ఇంట్లోకి వెళ్లి ఓపెన్ చేసి చూస్తే అందులో ఘడీ డిటర్జెంట్ సోప్స్ ఉన్నాయి. అయితే డెలివరీ బాయ్ రావడం, పార్శిల్ ఇవ్వడం లాంటి దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి కాబట్టి, ఆ సాక్ష్యాలతో యశస్వి శర్మ ఫ్లిప్‌కార్ట్‌కు కంప్లైంట్ చేశారు. మొదట ఫ్లిప్‌కార్ట్ కంప్లైంట్ తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఫ్లిప్‌కార్ట్ దిగొచ్చి రీఫండ్ ఇచ్చేందుకు అంగీకరించింది.

అందుకే ఇలాంటి చిక్కుల్లో పడకుండా మీరు కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ సిస్టమ్‌ను సరిగ్గా అర్థం చేసుకొని, నియమనిబంధనలన్నీ చదివి మీ పార్శిల్‌ను తీసుకునేప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి. పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేస్తే ఇంకా మంచిది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Laptop, Online shopping

ఉత్తమ కథలు