• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FLIPKART COOLING DAYS SALE FROM APRIL 9 TO 14 KNOW ABOUT DISCOUNT OFFERS ON AC AIR COOLER AND REFRIGERATOR SS

Flipkart Cooling Days: ఏసీ, కూలర్ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ ఇవే

Flipkart Cooling Days: ఏసీ, కూలర్ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ ఇవే

Flipkart Cooling Days: ఏసీ, కూలర్ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ ఇవే (image: Flipkart)

Flipkart Cooling Days | ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఏసీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్లపై ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    సమ్మర్‌లో ఇంట్లోకి ఏసీ తీసుకోవాలనుకుంటున్నారా? వేసవి తాపం తట్టుకోలేక ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? చల్లచల్లని ఐస్‌క్రీమ్ దాచుకోవడానికి రిఫ్రిజిరేటర్ కొంటారా? సమ్మర్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరోసారి కూలింగ్ డేస్ సేల్ ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి 14 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్‌లో ఎయిర్ కూలర్, ఏసీ, ఫ్యాన్, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌తో ప్రొడక్ట్స్ కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

    Flash Sale: రూ.10,499 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... కాసేపట్లో ఫ్లాష్ సేల్

    Realme: రూ.10,000 లోపు 3 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన రియల్‌మీ... ఫీచర్స్ ఇవే


    ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్‌లో బ్లూస్టార్ 1.2 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ ధర రూ.30,999 నుంచే ప్రారంభమవుతుంది. ఇక వాల్‌పూల్ 1.5 టన్ ఏసీని రూ.33,499 ధరకే కొనొచ్చు. సాంసంగ్ 1.5 టన్ ఏసీ ధర రూ.32.999 మాత్రమే. ఇవే కాదు కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంఛ్ అయ్యాయి. సాంసంగ్ ఏసీలు రూ.34,999, లాయ్ 2021 రేంజ్ ఏసీలు రూ.21,999, వాల్‌పూల్ కన్వర్టబుల్ ఏసీలు రూ.26,999, ప్యానాసోనిక్ ఏసీలు రూ.31,999 ధర నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇవే కాదు ఇన్వర్టర్ ఏసీలు, 3 స్టార్ ఏసీలు, 5 స్టార్ ఏసీలు, విండో ఏసీలు, ఫిక్స్‌డ్ స్పీడ్ ఏసీలపైనా ఆఫర్స్ ఉన్నాయి. ఇక హిండ్‌వేర్, సింఫనీ, బ్లూస్టార్, ఓరియంట్, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌బయ్, బజాజ్ ఎయిర్ కూలర్లపైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

    OPPO F19: భారీ బ్యాటరీతో ఒప్పో ఎఫ్19 రిలీజ్... ధర ఎంతంటే

    Jio Cricket plans: రేపటి నుంచి ఐపీఎల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే

    ఇక కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్స్ ధర రూ.20,690 నుంచి మొదలవుతాయి. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.4,500 లభిస్తుంది. వాల్‌పూల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.19,740 నుంచి మొదలవుతుంది. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.3,000. ఇక సాంసంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.17,490 నుంచి మొదలవుతుంది. ప్రీపెయిడ్‌పై అదనంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. వాల్‌పూల్ రిఫ్రిజిరేటర్ ధర రూ.10,790, హేయర్ 195 లీటర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.13,440, ఎల్‌జీ రిఫ్రిజిరేటర్ ధర రూ.12,690, మోటోరోలా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.20,999, గోద్రెజ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.11,990.
    Published by:Santhosh Kumar S
    First published: