జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్డ్ బిగ్ షాపింగ్ డేస్ సేల్

కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. మరో ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ సరిగ్గా అదే రోజు బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభించబోతోంది.

news18-telugu
Updated: July 13, 2018, 10:14 AM IST
జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్డ్ బిగ్ షాపింగ్ డేస్ సేల్
Flipkart Big Shopping Days sale.
  • Share this:
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లకు రెండు శుభవార్తలు. ఒకటి జూలై 16న అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉండబోతుందన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే రోజున ఇండియన్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ లాంటి వాటిపై భారీ ఆఫర్లు ఉండొచ్చని అంచనా.

గూగుల్ పిక్సెల్ 2 రూ.42,999 ధరకే కొనుక్కోవచ్చు. సుమారు రూ.27,000 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతోపాటు ఎక్స్‌చేంజ్‌పై రూ.3000 తగ్గింపు, రూ.8,000 క్యాష్‌బ్యాక్ అందిస్తారు. అంతేకాదు... రూ.37,000 ధరకు గ్యారెంటీడ్ బైబ్యాక్‌ను ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్. ఇక మిగతా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ వివో, యాపిల్, హానర్, ప్యానసోనిక్ లాంటివి కూడా భారీ ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. వివో వీ7 ప్లస్ 64జీబీ వేరియంట్‌ రూ.2,000 డిస్కౌంట్‌తో రూ.19,999 ధరకు కొనుక్కోవచ్చు. ఇక హానర్ 9ఐ ఐదువేల తగ్గింపుతో ఆఫర్ ధర రూ.14,999. ప్యానాసోనిక్ పీ95 అసలు ధర రూ.6,490. ఆఫర్‌లో రూ.3,999 ధరకే కొనుక్కోవచ్చు.

యాపిల్ ఫోన్లపై ఎంతెంత తగ్గింపు ఉంటుందన్నదానిపై సమాచారం లేదు. పవర్ బ్యాంక్స్ లాంటి మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌లపై భారీ తగ్గింపు ఉంటుంది. గూగుల్ హోమ్, క్రోమ్ క్యాస్ట్‌లాంటి వాటిపై ఎక్స్‌క్లూజీవ్ డీల్స్ ఉంటాయి. గేమింగ్ ఇష్టపడేవారికి ఏసర్ ప్రిడేటర్ ల్యాప్‌టాప్స్ రూ.63,990 ధరకు మొదలవుతాయి. యాపిల్ వాచ్ సిరీస్ 3, సిక్త్స్ జెన్ ఐప్యాడ్‌లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయెన్సెస్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 16 సాయంత్రం 4 గంటలకు ఈ సేల్ మొదలవుతుంది. ప్రతీ 8 గంటలకోసారి కొత్త ప్రొడక్ట్స్ లిస్ట్‌లో చేరతాయి. జూలై 16న సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు రష్ హవర్ సేల్ నిర్వహిస్తారు.
Published by: Santhosh Kumar S
First published: July 13, 2018, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading