రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు తెలుసుకోండి

. మొబైల్ బయ్‌బ్యాక్ ప్రొటెక్షన్‌తో పాటు రూ.99కే కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డులపై కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: December 5, 2018, 6:42 PM IST
రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు తెలుసుకోండి
ఫ్లిప్‌కార్ట్ (Image: Reuters)
  • Share this:
మరో సేల్‌కు ఫ్లిప్‌కార్ట్ అంతా సిద్ధం చేసింది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్ జరగనుంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని డీల్స్ రివీల్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. మొబైల్ బయ్‌బ్యాక్ ప్రొటెక్షన్‌తో పాటు రూ.99కే కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డులపై కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లున్నాయి.

టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 70 శాతం, ల్యాప్‌టాప్స్, కెమెరా, ఆడియో యాక్సెసరీస్‌పై 80 శాతం, ఫ్యాషన్ హోమ్, ఫర్నీచర్‌పై 40 నుంచి 80 శాతం, బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. గేమ్ జోన్‌లో ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ ఓచర్లు కూడా గెలుచుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

పోకో ఎఫ్1: లాంఛ్ అయినప్పుడు 6జీబీ+64జీబీ ధర రూ.20,999 కాగా ఆఫర్‌ ధర రూ.19,999. 6జీబీ+128జీబీ ధర రూ.23,999 కాగా ఆఫర్‌ ధర రూ.21,999. 8జీబీ+256జీబీ ధర రూ.29,999 కాగా ఆఫర్‌ ధర రూ.25,999.


రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999. ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది.
షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్‌ ధర రూ.12,999.
రియల్‌మీ సీ1: 2 జీబీ+16 జీబీ అసలు ధర రూ.7,999. సేల్‌లో రూ.500 తగ్గింపుతో లభిస్తుంది.నోకియా 5.1 ప్లస్: సెప్టెంబర్‌లో లాంఛైనప్పుడు 3జీబీ+32జీబీ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.9,999 ధరకే కొనొచ్చు.
మోటోరోలా వన్ పవర్: అసలు దర రూ.15,999. ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999 ధరకే కొనొచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ. 7,999 ధరకే లభిస్తుంది.
నోకియా 6.1 ప్లస్: అసలు ధర రూ.15,999. ఆఫర్ ధర రూ.14,999.
పిక్సెల్ 2ఎక్స్ఎల్: అసలు ధర రూ.45,499. ఆఫర్ ధర రూ.39,999.
ఏసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్

జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

వాట్సప్ మెసేజ్‌లపై పోలీసుల నిఘా

జనవరి 1 లోపే టీవీ, ఫ్రిజ్ కొనండి... 7-10% రేట్లు పెరుగుతున్నాయి

2018 టాప్ మొబైల్ యాప్స్ ఇవే... మీ దగ్గరున్నాయా?

ఎస్‌బీఐ కస్టమర్లకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ

 
First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు