HOME »NEWS »TECHNOLOGY »flipkart big savings day sale from september 18 to 20 state bank of india sbi card users can get 10 per cent instant discount ss

Flipkart Big Saving Days: మీకు నచ్చిన ప్రొడక్ట్ ఒక్క రూపాయికే బుక్ చేసుకోవచ్చు

Flipkart Big Saving Days: మీకు నచ్చిన ప్రొడక్ట్ ఒక్క రూపాయికే బుక్ చేసుకోవచ్చు
Flipkart Big Saving Days: మీకు నచ్చిన ప్రొడక్ట్ ఒక్క రూపాయికే బుక్ చేసుకోవచ్చు (image: Flipkart)

Flipkart Big Saving Days Sale | కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లాంటికి తీసుకోవాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఆఫర్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
    ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రకటించింది. పండుగ సీజన్ రాబోతుండటంతో భారీ ఆఫర్స్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ప్రీ-బుక్ డీల్ కూడా ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 17న సాయంత్రం సేల్ మొదలవుతుంది. సేల్ సెప్టెంబర్ 20న ముగుస్తుంది. అంటే ఇతర కస్టమర్ల కన్నా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు ముందుగానే ఆఫర్‌పై ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఇక ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. వేర్వేరు టీవీ బ్రాండ్స్‌పై 35 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక ల్యాప్‌టాప్స్, ఫ్యాషన్ వేర్, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్‌పై డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఇతర ప్రొడక్ట్స్ తగ్గింపు ధరల్ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

    Poco M2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్



    Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో ఫస్ట్ సేల్ ఈరోజే... ఆఫర్స్ తెలుసుకోండి

    ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా కస్టమర్లు సేల్ వరకు ఆగకుండా అంతకన్నా ముందే తమకు నచ్చిన ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.1 చెల్లించి తమకు నచ్చిన ప్రొడక్ట్స్ ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ప్రీ-బుక్ సేల్ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ అయి ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ప్రొడక్ట్ ఉంటే కేవలం రూ.1 చెల్లించి బుక్ చేసుకోవాలి. మిగతా డబ్బును సేల్ సమయంలో చెల్లించాలి. సేల్‌లో ఆ ప్రొడక్ట్ ధర ఎంత ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‍స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైనా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:September 15, 2020, 12:47 IST

    टॉप स्टोरीज