news18-telugu
Updated: June 22, 2020, 3:42 PM IST
Tecno spark power 2: పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ... రూ.9,999 ధరకే అదిరిపోయే ఫీచర్స్
(image: Tecno)
టెక్నో మొబైల్ ్ఇటీవల రిలీజ్ చేసిన టెక్నో స్పార్ట్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ ఇవాళ అర్థరాత్రి 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు. టెక్నో స్పార్ట్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్‌తో ర్ట్ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది టెక్నో మొబైల్స్. రూ.9,999 ధరకే అదిరిపోయే ఫీచర్స్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. టెక్నో స్పార్ట్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇంత తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి బడా కంపెనీలకు సవాల్ విసిరింది. 7 అంగుళాల పెద్ద డిస్ప్లే, 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 16 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెససర్ ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
టెక్నో స్పార్ట్ పవర్ 2 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 7 అంగుళాల హెచ్డీ+ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఐస్ జేడియట్, మిస్టీ గ్రే
ధర: రూ.9,999
ఇవి కూడా చదవండి:
Flipkart Sale: రూ.52,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.21,999 ధరకే... అదిరిపోయిన ఆఫర్
Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? పేటీఎంలో ఫ్రీగా ఒక్క నిమిషంలో తెలుసుకోండి
Published by:
Santhosh Kumar S
First published:
June 22, 2020, 3:42 PM IST