హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. బెస్ట్ డిస్కౌంట్‌లో టాప్ డీల్స్ ఇవే..!

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. బెస్ట్ డిస్కౌంట్‌లో టాప్ డీల్స్ ఇవే..!

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరొక కొత్త సేల్‌తో వినియోగదారులను ఆకర్షించడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ రేపు అంటే జులై 23న బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 (Big Saving Days sale 2022) ప్రారంభించనుంది.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరొక కొత్త సేల్‌తో వినియోగదారులను ఆకర్షించడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ రేపు అంటే జులై 23న బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 (Big Saving Days sale 2022) ప్రారంభించనుంది. ఐదు రోజులపాటు (జులై 27 వరకు) కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లతో పాటు అనేక రకాల ఎలక్ట్రానిక్‌లపై చక్కటి ఆఫర్లు, డిస్కౌంట్స్ అందుకోవచ్చు. ఒప్పో, యాపిల్, వివో, మోటారోలా వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్స్‌ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు ముందు, కస్టమర్లు కొన్ని అర్హత గల వస్తువుల (Eligible Items)ను రూ.1 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

ఈ భారీ సేల్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్స్‌ను 80 శాతం వరకు డిస్కౌంట్స్‌తో సొంతం చేసుకోవచ్చు. అలానే, హెడ్‌ఫోన్లపై 70 శాతం వరకు డిస్కౌంట్స్‌ను అందుకోవచ్చు. మౌస్, రూటర్లు, కీబోర్డులు వంటి రకరకాల కంప్యూటర్ అప్లయన్సెస్‌ను కేవలం రూ.99 ప్రారంభ ధరతో దక్కించుకోవచ్చు. కస్టమర్లకు లార్జ్ స్క్రీన్ టాబ్లెట్‌లు 45 శాతం డిస్కౌంట్స్‌తో లభిస్తాయని కంపెనీ తెలిపింది. స్మార్ట్ వాచ్‌లపై 65 శాతం, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్‌పై 60 శాతం, ఏసీలపై 55 శాతం, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై 50-80 శాతం వరకు డిస్కౌంట్స్‌ ఉంటాయని ప్రకటించింది. సేల్ సమయంలో టీవీలు, అప్లయన్సెస్‌లు ఏకంగా 70 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఎర్లీ-బర్డ్ డిస్కౌంట్‌లు, ఆఫర్లను ప్లస్ మెంబర్స్ పొందొచ్చు.

సేల్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంపెనీ ఫ్రెష్ డీల్స్‌ను కూడా అందుబాటులోకి తెస్తుంది. ఈ సేల్‌లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే టిక్‌టాక్ డీల్స్‌లో అతి తక్కువ ధరలకే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఎక్కువ సేవింగ్స్ కూడా చేయవచ్చు. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, సీఐటీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డ్‌లు ఉపయోగించి కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ సేల్‌లో మొబైల్స్‌ ఉన్న ఆఫర్లివే

ఈ సేల్‌లో ఐఫోన్ 12 రూ.52,999కే కొనుగోలు చేయవచ్చు. ముందుగా చెప్పినట్టు, సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేసి రూ.1,000 డిస్కౌంట్‌తో ఐఫోన్ 12ని రూ. 51,999కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ తర్వాత Moto G60 రూ.13,999కి లభిస్తుంది. ఐఫోన్ 11 కూడా భారీ తగ్గింపుతో దొరుకుతుంది. ఈ ఐఫోన్ మోడల్ రూ.39,999కే ఇస్తుంది. Vivo T1 44W ధర రూ.13,499కి తగ్గుతుంది. Redmi Note 10 Pro రూ.13,999 ధరతో అందుబాటులోకి వస్తుంది.

First published:

Tags: Discounts, Flipkart, Offers, Smart phones

ఉత్తమ కథలు