Home /News /technology /

FLIPKART BIG SAVING DAYS SALE HERE IS THE LIST OF BEST SMART TVS AVAILABLE UNDER RS 15000 NS

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రూ.8 వేలకే 32 ఇంచుల స్మార్ట్‌టీవీ.. 10 వేల ధరలో మరో 5 టీవీలు.. ఆఫర్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వైపు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తుంటే.. ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రెండూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అమెజాన్ ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తుంటే.. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ నిర్వహిస్తోంది.

ఇంకా చదవండి ...
  ఒక వైపు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తుంటే.. ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon) , ఫ్లిప్ కార్ట్ (Flipkart) రెండూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అమెజాన్ ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale 2022) ను నిర్వహిస్తుంటే.. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) నిర్వహిస్తోంది. ఈ రెండు సేల్స్ లలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై (Smart TV Offers) ఏకంగా 70 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేలు అంతకన్నా తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు.

  OnePlus Y1 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ వన్ ప్లస్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,999. కాగా ఈ టీవీపై ప్రస్తుతం 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ టీవీని రూ.13,990 కే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీకె డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేల తగ్గింపు అందుకోవచ్చు. అంటే రూ.11,990కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ టీవీపై ఎక్సేంజ్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మీ పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.9 వేల తగ్గింపు లభిస్తుంది. మీ పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే తగ్గింపు ఆధారపడి ఉంటుంది. మీ టీవీ మోడల్, కండిషన్ బాగుంటే మీకు పూర్తి రూ.9 వేల ఎక్సేంజ్ ఆఫర్ లభిస్తుంది.
  Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. బెస్ట్ డిస్కౌంట్‌లో టాప్ డీల్స్ ఇవే..!

  realme 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ రియల్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీపై సైతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.17,999 కాగా.. 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ టీవీని 25 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేల తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా రూ.11 వేల ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఈ టీవీపై అందుబాటులో ఉంది.

  Mi 5A 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999 కాగా ఈ టీవీపై 42 శాతం వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేల తగ్గింపును అందుకోవచ్చు. ఇంకా రూ.11 వేల ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఈ టీవీపై అందుబాటులో ఉంది.

  KODAK 7XPRO Series 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ టీవీపై సైతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.18,499 కాగా.. 37 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఎవరైనా ఈ టీవీని కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఈ టీవీపై ఇంకా రూ.10,875 ఎక్సేంజ్ ఆఫర్ లభిస్తుంది.

  Thomson 9A Series 80 cm (32 inch) HD Ready LED Smart Android TV: ఈ టీవీ అసలు ధర రూ.14,499 కాగా 24 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా రూ.10,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా కొటాక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా రూ.9 వేల ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఈ టీవీపై అందుబాటులో ఉంది.


  Infinix 80 cm (32 inch) HD Ready LED Smart Linux TV: ఈ టీవీ అసలు ధర రూ.16,999 కాగా.. 47 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ టీవీని రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు తగ్గింపు ను అందుకోవచ్చు. ఇంకా ఈ టీవీపై రూ.8 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Amazon, Budget smart tv, Flipkart, Smart tvs

  తదుపరి వార్తలు