Big Saving Days | ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. మీరు ఇంట్లోకి ఏమైనా కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ల (Smartphones) దగ్గరి నుంచి స్మార్ట్ టీవీల (Smart TV) వరకు చాలా ప్రొడక్టులను వివిధ రకాల ఆఫర్లు పొందొచ్చు. మీరు కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తూ ఉంటే మాత్రం.. అదిరిపోయే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. రూ.7 వేలకే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా?
అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో భాగంగా యాడ్స్‌సన్ స్మార్ట్ టీవీని రూ. 7 వేలకే కొనొచ్చు. ఇది 32 ఇంచుల స్మార్ట్ టీవీ. ఈ టీవీ ఎంఆర్‌పీ ఏకంగా రూ. 21,999గా ఉంది. అయితే దీన్ని మీరు ఇప్పుడు రూ. 7799కే కొనొచ్చు. అంటే మీరు నేరుగానే 64 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.
ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడు.. రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు, మీరు మాత్రం ఇలా చేయొద్దు!
అయితే మరో ఆఫర్ కూడా ఒకటి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు ఈ టీవీపై అదనంగా రూ.780 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు టీవీ ధర రూ. 7 వేలకు తగ్గినట్లు అవుతుంది. అందువల్ల స్మార్ట్ టీవీ కొనాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి లేవు.
నెలకు రూ.400 కడితే చాలు.. ఈ అదిరే ఫ్రిజ్ మీ సొంతం, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్!
కాగా మీరు ఎస్‌బీఐ కస్టమర్లు అయితే.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే.. మీరు నెలకు రూ. 700 చెల్లిస్తే చాలు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 700 కడితే సరిపోతుంది. 12 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే మీరు 9 నెలల ఈఎంఐ పెట్టుకుంటే అప్పుడు నెలకు రూ. 918 చెల్లించాల్సి వస్తుంది. ఆరు నెలలు అయితే నెలకు రూ. 1350 కట్టాలి.
ఇంకా ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ కూడా ఉంది. అంటే క్రెడిట్ కార్డు లేని వారు కూడా దీని ద్వారా టీవీ కొనొచ్చు. నెలకు రూ. 738 ఈఎంఐ పడుతుంది. ఇలా మీరు 12 నెలల వరకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 950 పడుతుంది. ఇక 6 నెలలు అయితే నెలకు రూ. 1,400 దాకా కట్టాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Latest offers, Offers, Smart TV