Flipkart Sale: లాక్‌డౌన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి భారీ సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart Big Saving Days sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూన్ 23న ప్రారంభం కానుంది. ఆఫర్స్, డీల్స్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: June 19, 2020, 11:29 AM IST
Flipkart Sale: లాక్‌డౌన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి భారీ సేల్... ఆఫర్స్ ఇవే
Flipkart Sale: లాక్‌డౌన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి భారీ సేల్... ఆఫర్స్ ఇవే (image: Flipkart)
  • Share this:
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద సేల్స్ ఏవీ కనిపించలేదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్‌కు సన్నాహాలు చేస్తోంది. జూన్ 23న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు జూన్ 22 రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్ జూన్ 27న ముగుస్తుంది. నాలుగు రోజుల భారీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, ఫ్యాషన్ వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ ఫర్నీచర్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌పైనా ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి.


క్రేజీ డీల్స్ పేరుతో మొబైల్స్‌పై అదనపు డిస్కౌంట్, రష్ హవర్ పేరుతో ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి. డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా రూ.5,000 వరకు కస్టమర్లు షాపింగ్ చేయొచ్చు. ఈ నెలలో షాపింగ్ చేసి వచ్చే నెలలో బిల్లు చెల్లించొచ్చు. బిల్లు చెల్లించడానికి 40 రోజుల గడువు ఉంటుంది. 40 రోజుల లోపు చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం ఛార్జీలు చెల్లించాలి.ఇవి కూడా చదవండి:

Samsung Smart TV: సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి... ధర రూ.14,490 నుంచి

Flipkart: మీ స్మార్ట్‌ఫోన్ పాడైందా? రూ.99 చెల్లిస్తే ఇంటి దగ్గరే రిపేర్

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా నుంచి రూ.251 ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 19, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading