మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? అయితే ఇంకో రూ.2,000 ఎక్కువ ఖర్చు పెట్టండి. రూ.22,000 ఖర్చు చేస్తే రూ.52,000 విలువైన స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అదిరిపోయే ఆఫర్ ఇది. జూన్ 23 నుంచి 27 మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల తర్వాత అతిపెద్ద సేల్ ఇది. ఈ సేల్‌లో ఊహించని డిస్కౌంట్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. గతేడాది సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరాతో ఈ ఫోన్ రిలీజైంది. అంటే రియర్ కెమెరాలే సెల్ఫీ కెమెరాల్లా పనిచేస్తాయి. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు కెమెరా ముందుకు రొటేట్ అవుతుంది. ఈ టెక్నాలజీ చూసి అద్భుతం అన్నారంతా.
సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.47,990 ధరకు ఇండియన్ మార్కెట్‌లో రిలీజైంది. ఈ ఫోన్ అసలు ధర రూ.52,000. కానీ రూ.4,000 తగ్గింపుతో ఇండియాలో రిలీజైంది. కానీ ఆ ధర ఎక్కువ అనుకున్నారు. ఆ తర్వాత కూడా ధర తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.41,999. కానీ ఇదే ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కొంటే మీరు ఊహించని ఆఫర్ పొందొచ్చు. ఏకంగా రూ.20,000 డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కేవలం రూ.21,999 ధరకే సేల్‌లో అమ్ముతున్నట్టు ప్రకటించింది. అంటే రూ.52,000 విలువైన ఫోన్ రూ.21,999 ధరకు కొనొచ్చు. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కానీ సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌కు హెచ్‌డీఎఫ్‌సీ డిస్కౌంట్ వర్తిస్తుందో లేదో తెలియాలంటే సేల్ ప్రారంభమయ్యే వరకు చూడాలి. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ డిస్కౌంట్ వర్తిస్తే మరో రూ.750 తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ డిస్కౌంట్ లేకపోయినా రూ.52,000 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,999 ధరకు కొనొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 9పై, సాంసంగ్ వన్ యూఐతో పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ గేమింగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో మెమొరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరా సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 3డీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా ఉండటం విశేషం. ఇవే కెమెరాలు రొటేట్ చేసి సెల్ఫీ తీసుకోవచ్చు. 3700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
Apps: ఈ 30 యాప్స్‌ని బ్యాన్ చేసిన గూగుల్... మీరూ వెంటనే డిలిట్ చేయండి
Samsung Smart TV: సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి... ధర రూ.14,490 నుంచి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Samsung, Smartphone, Smartphones