Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్​లో ఫ్లాగ్​షిప్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఐఫోన్​ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్​

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్​ ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ రోజు ప్రారంభమైంది. సాధారణ యూజర్లు రేపటి నుంచి పాల్గొనొచ్చు. ఈ సేల్ లో ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్​ వచ్చేసింది. ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ రోజే (జూలై 24) సేల్ మొదలు కాగా.. సాధారణ యూజర్లు రేపటి నుంచి పాల్గొనొచ్చు. జూలై 26న అమెజాన్ ప్రైమ్ సేల్ మొదలుకానుండగా.. అంతకుముందే ఫ్లిప్​కార్ట్ ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. అమెజాన్​ సేల్​లో కేవలం ప్రైమ్ మెంబర్లే పాల్గొనే అవకాశం ఉండగా.. ఫ్లిప్​కార్ట్ అందరికీ అవకాశం కల్పించింది. అందులోనూ అమెజాన్ ప్రైమ్ సేల్ 26, 27 రెండు రోజులు మాత్రమే సేల్స్ ప్రకటించింది. ప్లిప్​కార్ట్ సేల్ మాత్రం 29వ తేదీ వరకు కొనసాగనుంది. మరోవైపు ఫ్లిప్​కార్ట్ ఈసారి స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, స్మార్ట్​వాచ్​లు, ఆడియో ప్రోడక్టులపై మంచి ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ఫ్లాగ్​షిప్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అందులోనూ ఐసీసీఐ క్రెడిక్ కార్డును వినియోగిస్తే 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఫ్లాగ్​షిప్ ఫోన్లపై ఉన్న కొన్ని ఆఫర్లను చూస్తే..
JIO New Plans: జియో నుంచి సంచలన ప్లాన్లు.. ఏడాది పాటు ప్రతీ రోజు 3జీబీ, 2జీబీ డేటా.. వివరాలివే

iPhone 12: యాపిల్​ ఐఫోన్ కొనాలనుకున్న వారికి ఫ్లిప్​కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్​ 12 సిరీస్​, 12 మినీ, ఎక్స్​ఆర్​ మోడళ్లను మంచి డిస్కౌంట్లలో తీసుకొచ్చింది. ఐఫోన్​ 12 64 జీబీ మోడల్​ను రూ.67,999కే అమ్మకానికి ఉంచింది. దీంతో పాటు పాత ఫోన్​ను ఎక్చ్సేంజ్ చేసి రూ.19,250 వరకు లాభం పొందవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డులను వినియోగిస్తే 10 శాతం గరిష్ఠంగా రూ.1500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్​ 12 ఏ14 బయోనిక్ చిప్​తో కూడిన నెక్ట్స్​జెన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్​తో, మంచి స్పెసిఫికేషన్లతో ఉంది.

Moto Razr 5G: మరోవైపు మడతపెట్ట గలిగే మోటో రేజర్​ 5జీ ఫోన్​పైనా ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.1,09,900 ధర ఉన్న ఫోన్​ను బిగ్ సేవింగ్ డేస్​లో రూ.89,999 లకే అమ్మకానికి పెట్టింది. దీంతో పాటు ఐసీఐసీఐ కార్డు ఆఫర్​ను, ఎక్స్చేంజీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. మడత పెట్టే సదుపాయంతో పాటు రెండు డిస్​ప్లేలు, 5జీ ఫీచర్​, 48 మెగాపిక్సెళ్ల మెయిన్ కెమెరా ఈ ఫోన్ హైలెట్స్​గా ఉన్నాయి. ముఖ్యంగా దీని ప్రత్యేకమైన లుక్స్​ ఆకర్షించే విధంగా ఉన్నాయి. అలాగే 4జీ మోడల్​ రూ.54,999 కే సేల్​లో ఉంది.

iPhone 12 mini: ఐఫోన్ 12 సిరీస్​లో స్మాలెస్ట్ ఐఫోన్ 12 మినీ మోడల్​పై కూడా ఫ్లిప్​కార్ట్ ఆఫర్ ప్రకటించింది. దీని ఒరిజినల్ ధర రూ.69వేలు కాగా ప్రత్యేకంగా బిగ్​ సేవింగ్ డేస్​లో రూ.57,999 లకే సేల్​కు పెట్టింది. ఈ ఫోన్​ కూడా ఏ14 బయోనిక్ చిప్​తో కూడిన నెక్ట్స్​జెన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్​తో వస్తోంది. ముఖ్యంగా ఐఫోన్లలో కెమెరాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published: