Home /News /technology /

FLIPKART BIG SAVING DAYS BUY THESE 5 SMARTPHONES WITH PRICE UNDER RS 10000 ONLY NS

Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ 4 స్మార్ట్‌ఫోన్‌ల ధర ఆఫర్లో రూ.10 వేలలోపే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్ కార్ట్ సేల్ లో అనేక వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో Redmi, Motorola వంటి ఉత్తమ బ్రాండ్‌ల ఫోన్‌లు సైతం ఉన్నాయి.

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days) ఈ రోజు ప్రారంభమైంది. ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. జూలై 27 ఈ సేల్ కు ఆఖరి రోజు. ఈ సేల్ లో అనేక వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను (Smartphones) చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో Redmi, Motorola వంటి ఉత్తమ బ్రాండ్‌ల ఫోన్‌లు సైతం ఉన్నాయి. ఈ కంపెనీల అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఈ సేల్‌లో 10 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

    OPPO A11K: ఈ ఫోన్ 2 GB + 32 GB వేరియంట్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.10990 కాగా.. ఆఫర్లో రూ. 7,490కే సొంతం చేసుకోవచ్చు. OPPO A11Kలో 6.22 అంగుళాల HD + డిస్‌ప్లే, 13MP + 2MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4230 mAh బ్యాటరీ మరియు MediaTek Helio P35 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉన్నాయి.
    Big Saving Days: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఐ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

    Motorola G22: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Motorola G22 స్మార్ట్‌ఫోన్ 28 శాతం తగ్గింపుతో విక్రయించబడుతోంది. దీని 4 GB + 64 GB మోడల్ 9,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల HD + డిస్ప్లే, 50MP + 8MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు Mediatek Helio G37 ప్రాసెసర్‌తో వస్తుంది.

    Redmi 9i Sport : ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో 12% తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని కారణంగా మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.8,799కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో 6.53 అంగుళాల HD + డిస్‌ప్లే, 13MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ మరియు MediaTek Helio G25 ప్రాసెసర్ ఉన్నాయి.

    Infinix HOT 12 Play: Infinix యొక్క ఈ ఫోన్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో 29 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని కారణంగా ఫోన్ యొక్క 4 GB + 64 GB మోడల్‌ను రూ 8,499 కే కొనుగోలు చేయవచ్చు. 6.82-అంగుళాల HD + డిస్ప్లే, 13MP + డెప్త్ లెన్స్ బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ మరియు Unisoc T610 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

    POCO C31: బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో, POCO C31 స్మార్ట్‌ఫోన్ 33 శాతం తగ్గింపుతో విక్రయించబడుతోంది. దీని 4 GB + 64 GB మోడల్ సెల్‌లో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌లో 6.53 అంగుళాల HD + డిస్ప్లే, 13MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ మరియు MediaTek Helio G35 ప్రాసెసర్ ఉన్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Flipkart, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు